39.2 C
Hyderabad
March 29, 2024 14: 46 PM
Slider కడప

కెవిఆర్ ఆసుప‌త్రిపై చ‌ర్య‌లు తీసుకోవాలి

#ProdduturuHospital

ప్రొద్దుటూరు కెవిఆర్ ఆసుప‌త్రిలో అనైతిక వైద్యం కార‌ణంగా ప్రాణాలుకోల్పోయిన కుటుంబాల‌కు న్యాయం చేయ‌డంతో పాటు, ఆ వైద్యునిపై చ‌ర్యలు తీసుకోవాల‌ని బాధితుల‌తో క‌లిపి ప్ర‌జా సంఘాలు స్థానిక తాహశీల్దారు కార్యాల‌యం ఎదుట గురువారం ఆందోళ‌న చేప‌ట్టాయి.

సిపిఐ, మాన‌వ‌హ‌క్కుల వేదిక ఆధ్వ‌ర్యంలో మైదుకూరు,  ఆయ్య‌వారిప‌ల్లెకు చెందిన బాధిత కుటుంబస‌భ్యులు త‌మ అదేవ‌ద‌న‌ను వ్య‌క్తం చేశారు. కెవిఆర్ ఆసుప‌త్రిలో వైద్యం తీసుకోవ‌డం వ‌ల్లే తాము ఆర్థికంగా చితికి పోవ‌డ‌మేకాక‌, కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయామ‌ని చెప్పారు.

ఇలాంటి దుస్థితి మ‌రొక‌రికి క‌ల‌గ‌కుండా ఆ వైద్యునిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇదే సందర్భంలో న‌ష్ట‌పోయిన త‌మ‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని వారు డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్బంగా మాన‌వ‌హక్కుల వేదిక జిల్లా క‌న్వీన‌ర్ కె.జ‌య‌శ్రీ‌, సిపిఐ నాయ‌కులు రామ‌య్య‌,సుబ్బ‌రాయుడులు మాట్లాడుతూ, అనుమ‌తిలేకుండా వైద్యం చేయ‌డంపై ఆధారాల‌తో స‌హా జిల్లా వైద్యాధికారుల‌కు, జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసినా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో చెప్పాల‌న్నారు.

Related posts

వెంకటగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా గిరిజ కుమారి

Satyam NEWS

శాఫ్రన్ క్రైమ్: వాడు సన్యాసి కాదు రేపిస్టు

Satyam NEWS

కోర్టుల చీవాట్ల వల్లే ఉచిత వ్యాక్సిన్ ఇస్తున్న నరేంద్రమోడీ

Satyam NEWS

Leave a Comment