32.2 C
Hyderabad
April 20, 2024 19: 47 PM
Slider కరీంనగర్

రైతులను విస్మరించి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ సర్కార్

#ProtestRally

దేశ వ్యాప్తంగా రైతులు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తుంటే ప్రధానమంత్రి మోడీ మాత్రం  రైతులను విస్మరించి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాడని సీపీఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి ఆరోపించారు. కేంద్రం తెచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు గా సీపీఐ,సీపీఎం పార్టీలు,రైతు సంఘాల,ప్రజా సంఘాల  ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలోని గుండ్లపల్లి-రేణికుంట వద్ద గల టోల్ గేట్ ముందు రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు.

భారీగా వాహనాలు నిలిచిపోవడంతో  పోలీసులు నేతలను అరెస్ట్ చేసి తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా  కేదారి మాట్లాడుతూ అధికార బలంతో మోడీ ప్రభుత్వం ప్రజా,రైతు,కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులకు నష్టం కలిగించే మూడు నూతన చట్టాలను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో పంజాబ్,హర్యానా,రాజస్థాన్,గుజరాత్ లాంటి రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తుంటే మోడీ కి కనిపించడం లేదా అని కేదారి ప్రశ్నించారు.

దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు,పెట్టుబడిదారులకు,బహుళజాతి సంస్థలకు అప్పగించేందుకు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాడని అలాగే దేశానికి అన్నం పెట్టే రైతులను,వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నాడని,చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఇప్పిటికే కొంత మంది రైతుల ప్రాణాలు బలిగొన్న మోడీ ప్రభుత్వం మీరు రైతుల పక్షమా ? లేక కార్పొరేట్ శక్తుల పక్షమా ? తేల్చి చెప్పాలని కేదారి డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్,జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్,జె.వి.రమణా రెడ్డి కరీంనగర్ తిమ్మాపూర్, చిగురుమామిడి గన్నేరువరం,సైదాపూర్ మండలాల కార్యదర్శులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని తిరుపతి, నాగేల్లి లక్ష్మారెడ్డి, కాంతాల అంజి రెడ్డి, గుండేటి వాసుదేవ్,రైతు సంఘం జిల్లా కార్యదర్శి బండ రాజిరెడ్డి,

సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బోనగిరి మహేందర్,ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి,ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బ్రామండ్ల పెల్లి యుగేందర్,సీపీఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శి వర్ణ వెంకట రెడ్డి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుడికందుల సత్యం,సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్,

యూ.శ్రీనివాస్ రాయికంటి శ్రీనివాస్,అజయ్, సీపీఐ, రైతు సంఘం నాయకులు ముద్రకోల రాజయ్య,చొక్కల్ల శ్రీశైలం,పొన్నం కనకయ్య,కిన్నెర మల్లవ్వ,నల్లగొండ శ్రీనివాస్ అవునూరి రమేష్,సూరం మల్లేశం,కుమార్,ఎగుర్ల మల్లేశం,నునావత్ శ్రీనివాస్, ఏడుమేకల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆపద కాలంలో అండగా నిలిచిన బాల్య మిత్రులు

Satyam NEWS

మృతవీర సైనికులకు జోహార్లు

Satyam NEWS

MGNREGS బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించక పోతే హైకోర్టు ను ఆశ్రయిస్తాం

Satyam NEWS

Leave a Comment