33.2 C
Hyderabad
April 26, 2024 02: 59 AM
Slider నిజామాబాద్

మీ ఇంటిని కబ్జా చేసి నోటిసిస్తే ఊరుకుంటావా..?

#kamareddy

మీ ఇంటిని కబ్జా చేసి నోటీసు ఇస్తే ఊరుకుంటావా సార్ అంటూ మున్సిపల్ కమిషనర్ ను రైతులు ప్రశ్నించారు. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ వివాదం రైతులు మున్సిపల్ ముట్టడికి దారి తీసింది. రైతుల అనుమతి లేకుండా రైతుల భూముల్లోంచి రోడ్డు ఎలా వేస్తారని ప్రశ్నిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రైతులు మున్సిపల్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. రైతులు పెద్ద ఎత్తున వస్తుండటంతో మున్సిపల్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టారు. అనుమతి లేకుండా మా భూముల్లోంచి రోడ్లు వేయడానికి నోటీసులు ఎలా ఇస్తారని రైతులు మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించారు. నీ ఇంటిని కబ్జా చేసి నోటీసు ఇస్తే ఊరుకుంటావా అని కమిషనర్ ను నిలదీశారు.

కమిషనర్ తో వాగ్వాదానికి దిగిన రైతులు

మాస్టర్ ప్లాన్ పేరుతో భూములు లాక్కోవడంపై సమాధానం చెప్పాలని కమిషనర్ ను డిమాండ్ చేయడంతో జూమ్ మీటింగ్ ఉందంటూ తన కమిషనర్ కార్యాలయం లోపలికి వెళ్లిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. తమ భూముల్లోంచి రోడ్లు వేస్తే జేసిబిలతో తవ్వేస్తామని హెచ్చరించారు. భూములు గుంజుకునే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు.

కమిషనర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని రైతులు డిమాండ్ చేయగా టిపిఓ గిరిధర్ వచ్చి కమిషనర్ కు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో టిపిఓపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ పై అథరైజ్డ్ అధికారి మీరేనా అని బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి టిపిఓను ప్రశ్నించారు.. పూర్తి అధికారం కమిషనర్ కే ఉందని టిపిఓ చెప్పడంతో తాము కమిషనర్ తోనే మాట్లాడతామని, ఆరోగ్యం బాగలేకపోతే సెలవు పెట్టి ఇంట్లో కూర్చోవాలని రమణారెడ్డి అనడంతో కాసేపటికి కమీషనర్ మళ్ళీ బయటకు వచ్చి మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాల కోసం 60 రోజుల గడువు ఉందని, అభ్యంతరాలు ఉంటే తెలపాలని కమిషనర్ సూచించారు.

కమిషనర్ ను ప్రశ్నిస్తున్న రమణారెడ్డి

తర్వాత కౌన్సిల్ లో చర్చిస్తామని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ తో రైతులు సుమారు 4 వేల కోట్లు నష్టపోతున్నారని రమణారెడ్డి తెలిపారు. రైతుల వద్దకు వెళ్లి ఎవరెవరి భూములు ఎంతమేర నష్టపోతున్నాయో రైతులకు వివరించాల్సిందని, అలా చేయకుండా సర్వే ఎలా చేస్తారని రమణారెడ్డి ప్రశ్నించారు. అభ్యంతరాలకు 200 పైగా దరఖాస్తులు వస్తే కేవలం 80 మాత్రమే వచ్చాయని మీడియాను తప్పుదోవ పట్టిస్తారా అని నిలదీశారు.

జనరల్ బాడీ తీర్మానం లేకుండానే ముసాయిదా మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసారని, 49 మంది కౌన్సిలర్లు దద్దమ్మలు అయ్యారని విమర్శించారు. కమీషనర్ చెప్పిన ప్రకారం జనవరి 11 వరకు సమయం ఉందని, తర్వాత 49 మంది కౌన్సిలర్లు తీర్మానం చేసి వాళ్ళ ఇళ్లపైకి రైతులు వచ్చేలా చూస్తారో.. లేక రైతుల వద్దకు వెళ్లి అభిప్రాయం సేకరిస్తారో చూస్తామని మున్సిపల్ నుంచి వెళ్లిపోయారు

అరెస్ట్ చేస్తారని ప్రచారం

మున్సిపల్ కార్యాలయానికి రైతులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని ముందస్తుగా తమ విధులకు ఆటంకం కలిగించకుండా బందోబస్తు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ పోలీసులకు లేఖ రాశారు. దాంతో ఉదయాన్నే పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహించారు. డా.బీఆర్. అంబెడ్కర్ వర్థంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీజేపీ నేతలు రమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళడానికి బయలుదేరారు. ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తారని ప్రచారం సాగినా అదేమి జరగలేదు. మున్సిపల్ కమిషనర్ వద్దకు పోలీసులే రైతులను తీసుకెళ్లారు. సుమారు గంటన్నర పాటు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన అనంతరం రైతులు వెళ్లిపోవడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలకు తెరపడింది.

రైతులతో చర్చిస్తున్న రమణారెడ్డి

Related posts

దీర్ఘ కాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే భూముల రీ స‌ర్వే

Satyam NEWS

జాతీయ ఫెన్సింగ్ పోటీలకి శర్వాణీ విద్యార్ధి ప్రణయ్

Satyam NEWS

కోడలి తల నరికి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లొంగిపోయిన అత్త…

Satyam NEWS

Leave a Comment