28.7 C
Hyderabad
April 25, 2024 06: 06 AM
Slider కడప

నంద్యాలలో జరిగినవి ఆత్మహత్యలు కాదు ప్రభుత్వ హత్యలే

#Kadapa TDP

కర్నూలు లో ముస్లిం ఫ్యామిలీ ఆత్మహత్య పై వివిధ ప్రజా సంఘాల నేతలతో కలసి కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వి.ఎస్.అమీర్ బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వి.ఎస్.అమీర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిలకు రక్షణ కరువైపోయిందని, ప్రభుత్వ అసమర్థత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ ధోరణికి తోడు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ వ్యవస్థ మొత్తం, వైసీపీ నేతల అక్రమ దందాల కోసమే పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు.

అరెస్టైన 24 గంటలలోపే సిఐ, కానిస్టేబుల్ లను బెయిల్ పై విడుదల చేయడం వైసీపీ ప్రభుత్వ కంటితుడుపు చర్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి, రాష్ట్ర డీజీపీ నంద్యాలలో జరిగిన సంఘటనలను సహించేది లేదని చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్టైన వారిని బెయిల్ పై విడుదల చేయటంలోని ఆంతర్యమేమిటి? అని ప్రశ్నించారు.

ముస్లింలను వేధింపులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారన్నందుకు సలాం కుటుంబ ఆత్మహత్యే నిదర్శనం, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అన్నారు.

ఈ సమావేశంలో తెదేపా నాయకులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు నక్కల శివరాం, మాజీ శాప్ డైరెక్టర్ జయచంద్ర, జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, నగర అధ్యక్షుడు జిలానీ బాష, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జలతోటి జయకుమార్,

నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ద్వారకనాథ్, ప్రజా సంఘాల నాయకులు సంఘ సేవకుడు సలావుద్దీన్, మైనార్టీ ఫోరమ్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు దస్తగిరి, జాతీయ బీసీ మహాసభ రాష్ట్ర కన్వీనర్ మాసా కోదండ రామ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అష్రాఫ్ అలీ,

ముస్లిం ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ గౌస్ పీర్, ఆప్ కీ అవాజ్ రాష్ట్ర కార్యదర్శి మాగ్ బు బాష, యు.ఎం.ఎఫ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఫీక్ ఖాన్, పాపులర్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, అన్వర్ హుస్సేన్, డిఎమ్మెస్ అధ్యక్షుడు రామాంజనేయులు, మైనారిటీ రైట్స్ ఫోరమ్ నాయకులు అబ్దుల్ మాలిక్, ఆన్సర్ బాష, గౌస్ బాష, జాబీబుల్లా, ఇంద్రిస్, సయ్యద్ నూర్, ఉమా మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మణి శర్మ విడుదల చేసిన “నిన్నే చూస్తు” ఆడియో ఆల్బమ్

Satyam NEWS

తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్న కిషన్ రెడ్డి

Satyam NEWS

విజయనగరం నడి రోడ్ పై డ్రంక్ అండ్ డ్రైవ్…!

Satyam NEWS

Leave a Comment