36.2 C
Hyderabad
April 25, 2024 20: 03 PM
Slider నల్గొండ

పబ్లిక్ సర్వీస్ ప్రశ్నాపత్రాల లీకేజీ పై ఆర్ డి ఓ కార్యాలయం ఎదుట ధర్నా

#protest

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాలు లీకేజీ వ్యవహారంపై సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ బిజెపి నియోజకవర్గ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రెవెన్యూ డివిజన్ అధికారికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడం వల్ల,రద్దయిన పరీక్షల వల్ల నష్టపోయిన విద్యార్థిని విద్యార్థులు,నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రశ్నాపత్రాల లీకేజీ కారకులైన మంత్రులు కెటిఆర్, సబితా ఇంద్రారెడ్డిని మంత్రివర్గం నుండి భర్తఫ్ చెయ్యాలని వారు కోరారు.

ప్రశ్న పత్రాలు లీకేజీ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిన 2014 సంవత్సరం నుండి నేటి వరకు ఎన్ని పేపర్లు లికైనయో వాటిపై సిబిఐతో విచారణ జరపాలని భారతీయ జనతా పార్టీ తరఫున శేఖర్ రెడ్డి కోరారు.తక్షణమే జరిగిన ఘటనలపై తగిన చర్యలు తీసుకోవాలని,లేని పక్షంలో తెలంగాణ విద్యార్థులు,నిరుద్యోగ లోకం ఈ ప్రభుత్వం మీద తీవ్రంగా పోరాటం చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి, రూరల్ అధ్యక్షుడు కుందూరు కోటిరెడ్డి, మఠంపల్లి మండల అధ్యక్షుడు దుండిగాల యల్లయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు దేనుమకొండ రామరాజు,గుండా గోపి, మంద వెంకటేశ్వర్లు,చింతలపూడి ఉమామహేశ్వరరావు,చిత్తలూరి సోమయ్య, కుర్ర గోపాల్,బానోత్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

సిపి ఐ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

Satyam NEWS

ముత్యాలమ్మకు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అర్ధనగ్న ప్రదర్శన

Satyam NEWS

Leave a Comment