34.2 C
Hyderabad
April 23, 2024 11: 31 AM
Slider రంగారెడ్డి

వెన్నెముక అయిన రైతు నడ్డివిరిచే చట్టాలు ఇవి

#TandurMLA

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలని  తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలో టిఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీజేఎస్ తదితర పార్టీల అద్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించి భారత్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

దేశానికి వెన్నెముక అయిన రైతుల నడ్డి విరిచే వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జై జవాన్.. జై కిసాన్.. అంటూ నినాదాలు చేశారు. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నామన్నారు.

నూతనంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని  డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు , తదితర దుకాణాలు తాండూరు లో బంద్ పాటించాయి.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న,  వైస్ చైర్మన్ దీపా, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, డాక్టర్ సంపత్ కుమార్, సీపీఐ విజయలక్ష్మి పండిట్, అసిఫ్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ అక్తర్, మురళి గౌడ్, నర్సిములు, బంటారం సుధాకర్, కౌన్సిలర్ సోమశేఖర్ సీపీఎం శ్రీనివాస్ ,  తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా నుంచి కోలుకున్న డోనాల్డ్ ట్రంప్

Satyam NEWS

ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

Satyam NEWS

గ్రానైట్ వ్యాపారులకు నోటీసులు

Murali Krishna

Leave a Comment