35.2 C
Hyderabad
April 20, 2024 16: 00 PM
Slider హైదరాబాద్

నల్ల బెలూన్లతో నిరసన

#tribalsjac

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు ఈ నెల 12వ తేదీన వస్తున్నందున కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీల అమలు గిరిజన వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో వారు మాట్లాడుతూ  విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా గిరిజనులను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 317 ఎకరాలు గిరిజన యూనివర్సిటీనీ ఏర్పాటు చేయాలని భూమిని కేంద్రానికి అప్పగించి మూడేళ్లు కావస్తున్న ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయడంలో లేదో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అడవుల్లో ఉత్పత్తులను సేకరించి  జీవనం సాగిస్తున్న కోట్లాదిమంది గిరిజనులు ఉపాధికి దూరమవుతారని అన్నారు. అటవీ సంరక్షణ నియమాలు బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందా  లేదా అనేది  నరేంద్ర మోడీ స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలో వేలాదిమంది గిరిజన యువతకు ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు  లభించే అవకాశం ఉన్నందున ఎప్పటిలోపు ఏర్పాటు చేస్తారో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో లక్షలాదిమంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన  ప్రభుత్వ రంగ సంస్థలను ఆరు చౌకగా కార్పోరేట్ల అమ్మడం వలన కేంద్ర బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను కాలరాస్తుందని విమర్శించారు.  ఈనెల 12న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నందున గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో  రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నల్ల బెలూన్లతో నిరసనలు తెలియజేయాలని పిలుపునిచారు.  రాజకీయాలకు అతీతంగా గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మనాయక్ , ఆర్ శ్రీరాం నాయక్, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్,టిఆర్ఎస్  గిరిజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. రాజలింగం నాయక్,లంబాడీస్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు సురేష్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకులు కే. సోమ్లా నాయక్ ,తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు  ఎం. బాలు నాయక్,నాయకులు ఆర్.శేఖర్ నాయక్ , ఆర్.పాండు నాయక్, గోరియా నాయక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్రమంగా పొలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితుల ఆందోళన

Satyam NEWS

కొల్లాపూర్ లో ఆక్రమ నిర్మాణాలపై కొరడా

Satyam NEWS

విజయవాడ పోలీసుల కొత్త ప్రయోగం మహిళా మిత్ర

Satyam NEWS

Leave a Comment