28.7 C
Hyderabad
April 20, 2024 03: 26 AM
Slider ప్రత్యేకం

విశ్లేషణ: సౌకర్యాలు కల్పించి లాక్ డౌన్ పొడిగించండి

lock down 121

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

మార్చి 24,2020.. …2.9 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక పరిపుష్టిని ఫణంగా పెట్టి 130 కోట్ల ప్రజలను ఇంటికి పరిమితం చేసి భారత ప్రభుత్వం సాహస నిర్ణయం తీసుకుంది.  రోడ్, రైలు, వాయు మార్గాలను మూసివేసి  అంత ర్రాష్ట్రీయ రాకపోకల్ని నిషేధించింది.

దేశంలో మొదటి కోవిడ్ -19 ను గుర్తించిన రెండు నెలల వ్యవధిలో  ఇప్పటి వరకు దాదాపు 6 వేలకు పైగా కరోనా బారిన పడగా 300 పైగా ప్రజలు చనిపోయినట్లు తాజా సమాచారం. వ్యాధి నిర్ధారణ సాధనాలు అందుబాటులో కి రావడంతో ప్రతీ గంట కు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది.

దేశ వ్యాప్తంగా దాదాపు 10 రాష్ట్రాలలో వైరస్ త్వరితగతిన విజృంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వ్యాప్తి అరికట్టినట్లు పాశ్చాత్య దేశాలలో రుజువైనది. అదే తరుణోపాయాన్ని ప్రయోగించి భారత్ కొంతమేర విజయం సాధించింది.

కానీ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పీడితుల వివరాలు, కోలుకున్న వారి వాస్తవ సంఖ్యను కేంద్రప్రభుత్వానికి పంపడంలేదని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కరోనా కట్టడికి ఏ విధమైన సహాయ, సహకారాలు అందించాలనే విషయంలో ఒక నిర్ధారణ కు రావడం కేంద్రానికి సవాలు గా మారింది.

దేశవ్యాప్తంగా వైరస్ బారినపడిన 250 పైగా జిల్లాలు అత్యంత ప్రమాదకరమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. మూడవ వంతు వైరస్ వ్యాప్తి ప్రధానంగా 7 రాష్ట్రా లలో కేంద్రీకృతమైంది. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అంచనా వేయడం సాథ్యం కాని పనిగా అధికారులు చెబుతున్నారు.

ప్రమాదకర ప్రాంతాలు పెరిగితే అరి కట్టే యంత్రాంగం సంసిద్ధగా లేకపోతే పరిస్థితి చేయిదాటిపోతుంద ని హెచ్చరిస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉండగా ప్రస్తుత లాక్డవున్ కొంతకాలం పొడిగిస్తేనే మంచిదని సర్వత్రా వినిపిస్తోంది.. లాక్డవున్ కారణంగా సేవారంగం, నిర్మాణరంగం, వివిధ పన్నులు వసూళ్లు పూర్తిగా స్తంభించాయి.

ఆదాయ వనరులు పనిచేయక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దుస్థితి నెలకొంది. నిలిచిపోయిన నిర్మాణ రంగం, ఉత్పత్తి రంగం, వ్యవసాయ ఆధారిత రంగాలు మూతబడటంతో జీడిపిలో సింహభాగం కుంటుపడింది.

దీనికితోడు వలస కార్మికుల జీవితాలు కాకవికలమయ్యాయి. ఈ నేపధ్యంలో లాక్డవున్ అనివార్యంగా అమలైతే దేశ ప్రజలకు అవసరమైన ఆహారం, మందులు, కనీస అవసరాలు సరి పడి నంతగా నిల్వచేయాలి.

ఒక వేళ లాక్డవున్ విరమించాలని నిర్ణయం తీసుకుంటె దశలవారీ అమలుచేయాలని ఆరోగ్య నిపుణులు సలహా గమనార్హం. అంతర్జాతీయ పరిణామాలు ప్రమాణం గా 3 అంచెల నిస్క్రమణ పాటిస్తే ప్రధాని ప్రవచించిన జాతి ఆరోగ్యం. ఆర్థిక సమతుల్యత సాధ్యం కాగలదు.

కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

క్ష‌త్రియుల స‌హ‌కారంతో న‌గ‌రంలో అల్లూరి విగ్ర‌హం ఏర్పాటు

Satyam NEWS

సంజయ్ ను తొలగించడంపై వ్యతిరేకత షురూ

Bhavani

ఫ్యామిలీ డాక్టర్ విధానం: ఊరూరా ఆధునిక వైద్యం

Satyam NEWS

Leave a Comment