పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి పరికరాలతో రోగ నిర్థారణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగ నిర్ధారణ కేంద్రాల ఏర్పాటుపై శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈటెల సమాధానం చెప్పారు. సుమారు 77 కోట్ల రూపాయలతో ఆల్ట్రాసౌండ్, ఎక్స్‌రే సహా పలు అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. పూర్తిస్థాయి రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు రోగాల నయం కోసం మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు.
previous post
next post