27.7 C
Hyderabad
April 24, 2024 09: 53 AM
Slider నల్గొండ

హెల్పింగ్ హ్యాండ్: కొనసాగుతున్న సహాయక చర్యలు

#PRTUHelpingHand

కరోనా కారణంగా కొనసాగుతున్న లాక్ డౌన్ నేపధ్యంలో పేద ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం రోజున పీ ఆర్ టి యు ఉపాధ్యాయ సంఘం మండల శాఖ వారు స్థానిక పారిశుద్ధ్య కార్మికులకు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమాన్ని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులను అభినందిస్తూ సమాజ సేవలో ఈ విధంగా కూడ పాల్గొనడం గొప్ప విషయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న పీ ఆర్ టి యు మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్, జడ్పిటిసి సుంకరి ధనమ్మ, సంఘం మండల బాధ్యులు బాధం భిక్షపతి, శరత్, సత్తయ్య, విజయ్ కుమార్, నర్రా నరేందర్ రెడ్డి, వల్లాల రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు. బతుకు తెరువు కోసం దేశం కాని దేశం వచ్చి కరోనా లాక్ డౌన్ లో ఇబ్బందులు ఎదురు కొంటున్న ఇద్దరు నేపాలీ దేశస్థుల కుటుంబాలను స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ సిలివేరు మౌనిక బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేసి ఉదారత్వాన్ని చాటారు. అలాగే ఆంద్రప్రదేశ్ నుండి వచ్చిన మరో 10 కుటుంబాల వారికి కూడా నిత్యావసర సరుకుల ను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు

Satyam NEWS

బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు…మ‌న‌ల్ని న‌మ్మ‌కున్న‌వాళ్ల గురించి ఆలోచించండి

Satyam NEWS

[NEW] 72hp Male Enhancement Pills For Sale As Seen On Tv And Gnc Male Enhancement How Much Garlic For Male Enhancement

Bhavani

Leave a Comment