35.2 C
Hyderabad
April 20, 2024 18: 12 PM
Slider నిజామాబాద్

పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం

#PRTU Kamareddy

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని  బిచ్కుంద మండలంలోని ఫత్లాపూర్ గ్రామంలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా ప్రధానకార్యదర్శి  అల్లపూర్ కుషాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు పీఆర్టీయూ లో చేరి సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు. నాటి నుండి నేటి వరకు ఉపాధ్యాయుల ఎన్నో సమస్యలను పీఆర్టీయూ మాత్రమే పరిష్కరించిందన్నారు.

బదిలీలు ప్రమోషన్ల సమస్యలను  పరిష్కరించేందుకు రాష్ట్ర శాఖ కృషి చేస్తుందన్నారు. సీపీఎస్ విధానంతో పాటు పలు సమస్యలపై ఇప్పటికే ప్రణాళిక రచించామని ఆయన గుర్తుచేశారు. మండల అధ్యక్ష కార్యదర్శులు సభ్యత్వ నమోదును వెంటనే పూర్తిచేయాలని త్వరలో ప్రభుత్వంతో చర్చించి అన్ని డిమాండ్స్ సాధిస్తాం అన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రతి సభ్యుని పేరు పీఆర్టీయూ యాప్  లో నమోదు చేసి, సభ్యునికి సందేశం   వచ్చే విధంగా చూడాలని తెలిప్యారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పీఆర్టీయూ నాయకులు  సీమ శ్రీనివాస్,హెడ్ మాస్టర్   మల్లికార్జున్ ,కిషోర్, ప్రధానకార్యదర్శి పెద్ద కొడప్గల్,

బిచ్కుంద అధ్యక్షులు ఈర్షద్ అలీ,జనరల్ సెక్రటరి చంద్రకాంత్ , హెడ్ మాస్టర్   బుజ్జయ్య,, పద్మభూషన్,ఉమాకాంత్, రాంరెడ్డి, శంకర్ ,హెడ్ మాస్టర్   హన్మంత్ , శ్రీనివాస్ , సంజయ్  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి

Satyam NEWS

కేసీఆర్ ను కలిసిన కూసుకుంట్ల

Murali Krishna

చదువుల తల్లి… ఎందుకో తెలియదు… చనిపోయింది

Satyam NEWS

Leave a Comment