31.7 C
Hyderabad
April 24, 2024 23: 03 PM
Slider ముఖ్యంశాలు

సైకో మొగుడు స్నేహితులు నుండి ప్రాణహాని

#Psycho Mogudu

న్యాయవాది వృత్తి లో ఉండి తనను శాడిజంతో హింసిస్తున్నాడని బాధిత మహిళ కడప ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో భోరున విలపించారు. ఆమె తెలిపిన వివరాల మేరకు మైదుకూరు మండలం గడ్డంవారిపల్లె కు చెందిన అంబారపు మస్తానయ్య తో 13 సంవత్సరాల క్రితం పెద్దలు కుదిర్చిన వివాహం జరిగిందని తెలిపారు. తన అమ్మ నాన్న ప్రకాశం జిల్లా కంభం కు చెందిన వారని ఆమె తెలిపారు.

తనకు ముగ్గురు సంతానం కలరని వారిని చదువు నిమిత్తం గోవా లో ఉంచారని పేర్కొన్నారు. పెళ్ళయిన నాటి తన భర్త అనేక రకాల వేధింపులకు గురి చేసేవాడని తెలిపారు. తన అమ్మ వారికి విషయం తెలిపితే చంపుతానని బెదిరింపులకు పాల్పడేవాడని వాపోయారు. ఇటీవల తన తమ్ముడు, నాన్న వచ్చినప్పుడు తన పరిస్థితిని గమనించి అప్పటికే చిత్రహింసలు తాళలేక లేవలేని పరిస్థితి గమనించి బాధపడుతుంటే 13 ఏళ్ళ గా పడుతున్న ఆవేదన, బాధలు చెప్పానని అలా అంటూ చెలరేగి ఒళ్ళంతా వాతలు పెట్టాడని బాధిత మహిళ సల్మా కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ జరిగిన దురాగతాలను వివరించింది. ఈ విషయం లో ప్రొద్దుటూరు ఎఎస్పీ ప్రేరణ ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు.

బాధలు భరించలేక ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశానని కేసు నుండి తప్పించుకున్న తన భర్త మస్తానయ్య ను గుత్తి రైల్వేస్టేషన్ లో ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ వారు అరెస్టు చేసి రిమాండ్ లో పెట్టారని అయితే తన భర్త మస్తానయ్య స్నేహితులు ప్రసాద్, అరుణ్ లు తమను బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.

ప్రసాద్ కానిస్టేబుల్ అని అరుణ్ ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారి నుండి తమకు ప్రాణ హాని ఉందని భయకంపితుల య్యారు. ఈ విషయం లో తమకు న్యాయం చేయాలని, దోషులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts

గౌలిపురాలో ఘనంగా ఆషాఢ బోనాలు

Satyam NEWS

హుజూర్ నగర్ పశు సంరక్షణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం

Satyam NEWS

50 శాతం అదనపు ఛార్జీతో సంక్రాంతికి 1266 ప్రత్యేక బస్సులు

Satyam NEWS

Leave a Comment