32.2 C
Hyderabad
March 29, 2024 00: 31 AM
Slider జాతీయం

సమాజానికి హక్కులతో బాటు బాధ్యతలు ఉండాలి

venkaiah

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాదు సమీపంలో చోటు చేసుకున్న దిశ ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన అఖిల భారతీయ సర్వీసుల 94వ ఫౌండేషన్ కోర్సు ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని 23 రాష్ట్రాలకు చెందిన 140 మంది అఖిల భారతీయ సర్వీసులు, కేంద్ర సివిల్ సర్వీసు శిక్షణ పొందిన యువ అధికారులను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.

మహిళలను గౌరవించుకునే భారతీయ విలువలు, సంస్కృతి సాంప్రదాయాలు సమాజంలో తగ్గిపోతుందనే ఇటీవలి కాలంలో లో ప్రచారమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. తిరిగి ఆ విలువలను సమాజంలో బాధ్యతగా నింపడం ద్వారానే ఇలాంటి ఘటనలకు ముగింపు పలకవచ్చని ఆయన సూచించారు.

చట్టసభల్లో చేసే చట్టాల ద్వారా మాత్రమే ఈ పరిస్థితుల్లో మార్పు రాదని.. సమాజంలో నెలకొన్న ఇలాంటి వాతావరణాన్ని మార్చడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఆయన సూచించారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నప్పుడు కొన్నిచోట్ల పోలీసులు స్పందించే తీరు కూడా వివాదాస్పదమవుతోందన్నారు.

అలా కాకుండా మహిళకు రక్షణ విషయంలో పోలీసులు ఫిర్యాదు స్వీకరించడం, కేసు నమోదు చేయడం విషయంలో చురుకుగా మానవతా దృక్పథంతో వివరించాలని ఆయన సూచించారు. సివిల్ సర్వీసెస్ అధికారులు దేశానికి ‘ప్రముఖ్ సేవక్‌’లు అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

అధికారులు సేవాభావాన్ని మనసులో నింపుకుని ప్రజాసేవను పవిత్రమైన బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు. ‘ప్రజలతోపాటు ప్రభుత్వం కూడా మీనుంచి చాలా ఆశిస్తారు. వాళ్ల సమస్యలను అర్థం చేసుకుంటారని ప్రజలు.. పథకాలను సమర్థవంతంగా అమలుచేస్తారని ప్రభుత్వం భావిస్తాయి.

మీపై చాలా ఒత్తిడి ఉంటుందని నాకు తెలుసు. కానీ ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో ఆలోచిస్తూ నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ.. దేశ సమగ్రత, సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మీ బాధ్యతలు నిర్వహించండి. సుపరిపాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.

భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న పేదరికం, ఇతర సమస్యలకు పరిష్కారం చెప్పేందుకు సమర్థులైన అధికారులుండానే ఉద్దేశంతోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ‘సివిల్ సర్వీసెస్’కు కొత్తరూపు తీసుకొచ్చారని ఆ మహానుభావుడి కలలను సాకారం చేస్తూ నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని యువ అధికారులకు ఆయన సూచించారు.

 సమాజంలో అందరికీ సమానావకాశాలు ఇవ్వడంలో, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను వారికి అందిస్తూనే.. వారి బాధ్యతలను గుర్తుచేయడంలో సివిల్ సర్వీసెస్ అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ‘ప్రస్తుతం ప్రజలకు సివిల్ సర్వెంట్లపై ఉన్నఅభిప్రాయాన్నిమార్చి ప్రజలకు అందుబాటులో ఉంటామనే అభిప్రాయాన్ని కల్పించినపుడే వారి సమస్యలను సరిగ్గా అర్థం చేసుకుని వాటిని పరిష్కరించగలం’ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించారు.

Related posts

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాధిద్దాం

Satyam NEWS

జవాన్‌ జశ్వంత్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తి

Satyam NEWS

పార్ట్ టైం ఉపాధ్యాయులా? హమాలీలా?

Satyam NEWS

Leave a Comment