అక్కినేని హీరో అఖిల్, గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ మూవీలో పూజ హెగ్డేని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అయితే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న పూజ, అఖిల్ సినిమాలో చేస్తుందా అనే డౌట్ అందరిలోనూ ఉండేది. ప్రస్తుతం వాల్మీకి, అల.. వైకుంఠపురములో, హౌజ్‌ఫుల్ 4, ప్రభాస్-రాధాకృష్ణ లాంటి భారీ చిత్రాలతో తెలుగు హిందీ భాషల్లో చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న పూజ… అఖిల్ నాలుగో చిత్రంలో నటిస్తున్నట్టు మేకర్స్ ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ గీత ఆర్ట్స్ ట్విట్టర్ లో పూజ హెగ్డేకి వెల్కమ్ చెప్తూ ఒక ఫోటో ట్వీట్ చేశారు.
previous post