37.2 C
Hyderabad
March 29, 2024 18: 15 PM
Slider ఖమ్మం

పోలియో చుక్కలు వేసిన మంత్రి పువ్వాడ

khammam polio

నిండు జీవితానికి రెండు చుక్కలతో పోలియో రహిత సమాజాన్ని కొనసాగిద్దామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం మమత ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రం వద్ద చంటి పిల్లలకు చుక్కల మందు వేశారు.

0-5 సంవత్సరాల పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 950 కేంద్రాల ద్వారా 1,27,882 మందికి చుక్కల మందు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లాలో 30 సంచార బృందాలు, 40 ట్రాన్సిస్ట్ కేంద్రాలను బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భద్రాద్రి  కొత్తగూడెం జిల్లాలో 925 బూత్ లు, 40 ట్రాన్సిస్ట్ బూట్ లు, 38 ప్లానింగ్ యూనిట్స్,  4026 మంది సిబ్బంది పోలియో చుక్కలు వేసేందుకు విధుల్లో ఉన్నారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పోలియోను సమర్ధవంతంగా నిర్ములించగాలిగామన్నారు. అందుకు ప్రభుత్వం పటిష్ట ప్రణాళికలు చేస్తుందని, ఇక పోలియో మహమ్మారి దరి చేరకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.  5 సంవత్సరాల లోపు పిల్లలను ప్రభుత్వం గుర్తిస్తుందని మీ వంతుగా తప్పకుండా పిల్లలకు చుక్కల మందు వేసుకోవాలి, వేయించాలని కోరారు.

Related posts

లిక్కర్ స్టోరీ: మందలించినందుకు యువకుడి ఆత్మహత్య

Satyam NEWS

విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నిరసన

Satyam NEWS

నిరుపేదలకు నిత్యావసరాలు పంచిన టీఆర్ఎస్ నేత

Satyam NEWS

Leave a Comment