Slider మహబూబ్ నగర్

పల్స్ పోలియో ను విజయవంతం చేయండి

palse polio

పల్స్ పోలియో ను విజయవంతం చేయాలని జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మెహనయ్య ఒక ప్రకటనలో కోరారు. శనివారం అచ్చంపేట పట్టణంలో వైద్య సిబ్బంది తొ పల్స్ పోలియో అవగాహన ర్యాలి నిర్వహించారు. నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు, అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు వేసుకోవాలని అనే నినాదాలతో  పట్టణంలో ర్యాలి నిర్వహించారు.

ర్యాలి కి డాక్టర్ మెహనయ్య మాట్లాడుతూ అచ్చంపేట డివిజన్ లో 20453 మంది చిన్న పిల్లల  5 సంవత్సరం లోపు  ఉన్నారని  వారికి పోలియో చుక్కలు వెయ్యడానికి  217 పోలియో బూత్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలియో చుక్కలు వెయ్యడానికి 904 సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో CHO ప్రభు, ఉప  మలేరియా నిర్మూలన అధికారి అశోక్, నిరంజన్, అబ్దుల్ సలీమ్ సిద్దాపూర్ వైద్య సిబ్బంది ఆశాలు  పాల్గొన్నారు.

Related posts

వెంకన్న పేరు చెప్పి రుణాలు తీసుకుని పరారైతే…..?

Satyam NEWS

బడ్జెట్ లో విద్యా రంగ కేటాయింపు నిరాశాజనకం

Satyam NEWS

స్వచ్ఛతలో మంగళగిరి ఆదర్శ కార్పోరేషన్

Satyam NEWS

Leave a Comment