Slider సినిమా

పునర్నవి-రాహుల్‌ల మధ్య సంథింగ్‌ సంథింగ్‌

punarnavi rahul

పునర్నవి-రాహుల్‌ల మధ్య ఏదో సంథింగ్‌ సంథింగ్‌ జరుగుతుందని ఇంటి సభ్యులతో పాటు నాగార్జున, రమ్యక్రిష్ణలు సైతం ‘రాహుల్‌- భూపాల’ ప్రేమకథపై ఆసక్తికలిగిస్తున్నారు. ఇదే అంశంతో నేటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో ఈ ఇద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ నడిచింది. నువ్‌ నన్ను ఏం అనలేదా? అంటూ మొదలైన చర్చలో.. పునర్నవి మాట్లాడుతూ.. ‘మన ఇద్దరి మధ్య సంథింగ్‌ ఏదో జరుగుతుందని అందరూ అనుకుంటుంటే.. నేను నీకు కాస్త దూరంగా ఉంటున్నా. దానికి నువ్‌ నన్ను షేడ్‌ అని అంటుంటే నేను ఏం అనుకోవాలి. నువ్‌ చిరాకు తెప్పిస్తే రాహుల్‌ పక్కకుపో అంటా.. అంతేతప్ప నిన్ను ఇగ్నోర్‌ చేయడం లేదు. నువ్‌ దేనికి ఎలా రియాక్ట్‌ అవుతావో నాకు తెలియడం లేదు. అసలు మన మధ్య ఏం జరుగుతుందో నాకే అర్ధం కావడం లేదు’ అంటూ రాహుల్‌తో సీరియస్‌గా మాట్లాడింది. దీనిపై రాహుల్‌ మాట్లాడుతూ.. ‘పున్నూ నువ్‌ నన్ను ఇగ్నోర్‌ చేస్తున్నావ్‌.. నా లైఫ్‌లో ఫస్ట్‌ టైం నా బిహేవియర్‌ బాలేదని చెప్పింది నువ్వే. బిగ్‌ బాస్‌ మన గురించి ఏదైనా అనుకుంటున్నారంటే మనం చేసిందే చూపిస్తున్నారు. నువ్‌ నా పట్ల కేర్‌ చూపిస్తుంటే ఖచ్చింగా ఏదో ఉందనే అనుకుంటారు. దాంట్లో ఏం తప్పు ఉంది. నువ్వే నన్ను మన ఇద్దరి మధ్య ఏం ఉంది అంటే లవ్‌ ఉందని చెప్పాలా? నీ వల్ల నా మైండ్‌ కరాబ్‌ అవుతుంది’ అంటూ పున్నూ దగ్గర రియాక్ట్‌ అయ్యాడు రాహుల్‌.

Related posts

ఏపిలో పంచాయతీ ఎన్నికల తాజా షెడ్యూల్ ఇది

Satyam NEWS

ఈవీఎం గోడౌన్ పనుల తనిఖీ

Bhavani

అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ లో వైద్య శిబిరం

Satyam NEWS

Leave a Comment