హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు ఫేజ్ 6 లో ప్యుర్ ఓ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ 5వ ఔట్ లెట్ ను నందమూరి వసుంధర దేవి తో పాటు శాసనసభ్యులు మాధవరం కృష్ణ రావు కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వసుంధర దేవి, మాట్లాడుతూ ఫలాలు పరిరక్షణకు సంజీవిని గా పని చేస్తాయని అన్నారు. ఉల్లాసంగా నాజూగ్గా ఉండడానికి వివిధ రకాల ఫలాలు ఆకుకూరలు తీసుకోవడం అవసరమని ఆమె అన్నారు.
ప్యుర్ ఓ నచురల్ వ్యవస్థాపకులు మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా వాషింగ్టన్ థాయిలాండ్ యుఎస్ వంటి దేశాల నుండి దిగుమతి చేసిన విభిన్న ఫలాలు అందుబాటులో ఉంటాయని 25 రకాల విదేశీ పాటు ఆంధ్ర తెలంగాణ రైతులు పండించిన ఆకుకూరలు లభిస్తాయని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 9542976567 ను సంప్రదించాలని కోరారు.