టిక్కెట్ బుకింగ్ లు గణనీయంగా తగ్గిపోవడంతో పుష్ప 2 సినిమా టిక్కెట్ల ధరలు పూర్తిగా తగ్గించేశారు. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ టికెట్ల ధరలు భారీగా పెంచేసిన విషయం తెలిసిందే. సినిమాకు డివైడ్ టాక్ రావడం, భారీగా కలెక్షన్లు తగ్గిపోవడంతో టిక్కెట్ రేట్లు తగ్గించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అధిక టిక్కెట్ ధరలను వారం రోజుల పాటు కొనసాగించాలని ముందుగా అనుకున్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు. దాంతో భారీగా టికెట్ ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150-100 మేర తగ్గాయి. రేపటి నుంచి ఈ ధరలు అందుబాటులోకి రానున్నాయి. బుకింగ్ సైట్లలో తగ్గించిన ధరలు అందుబాటు లో ఉన్నాయి.
previous post