36.2 C
Hyderabad
April 25, 2024 19: 28 PM
Slider ఆధ్యాత్మికం

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామాలయంలో పుష్పయాగం

Vontimitta 111

టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శనివారం సాయంత్రం పుష్పయాగం నిర్వహించారు. ఆలయంలో ఏప్రిల్ 2 నుండి 10వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ముందుగా ఆలయంలోని  రంగనాయకుల మండపంలో ప్రత్యేక పీఠంపై శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రాములవారి ఉత్సవమూర్తులను ఆశీనులను చేశారు.

750 కిలోలకు పైగా వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగాన్ని ఏకాంతంగా నిర్వహించారు. వీటిలో రోజాలు, కనకాంబరాలు, సంపంగి, చామంతి, మల్లెలు, మొల్లలు, తామర, వృక్షి, తులసి తదితర పుష్పాలు, పత్రాలు ఉన్నాయి. సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు పుష్పయాగం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటి ఈఓ లోకనాథం, ఉద్యానవన డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Related posts

రక్తదానం తో ప్రాణాలు నిలబెట్టిన DSR ట్రస్ట్

Satyam NEWS

60 సంవత్సరాలుగా సాధ్యం కాని సమస్యపై విజయం

Satyam NEWS

తెలుగు, ఉర్దు భాషల్ని వదిలేస్తామంటే ఊరుకోం

Satyam NEWS

Leave a Comment