సుగంధభరిత పుష్పపరిమళాలతో అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని మట్లి రాజుల కాలంలో నిర్మితమైన ప్రసిద్ద పుణ్య క్షేత్రం ఈటమార్పురం శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయ పరి సరాలు విరజల్లాయి. పూజారులు, అనధికారులు, భక్తుల వల్ల ఏవైనా దోషాలు ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా బ్రహ్మోత్సవాలు లేదా రోజువారీ వేడుకల్లో పుష్పయాగం చేయడం ఆనవాయితీ.
అందులో భాగంగా ఈటమార్పురం శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ తిరునాళ్ళు చివరిరోజు స్వామి అమ్మవార్ల కు పుష్ప యాగం ఘనంగా నిర్వహించారు. మనసంతా ఎంతో భక్తి భావాలు నింపుకొని 108 బుట్టలతో ప్రత్యేక వేదిక చెంతకు భక్తులు తిరుపతికి చెందిన కాంట్రాక్టర్ బత్తిన గుండాల రెడ్డి,ఆలయ చైర్మన్ బత్తిన తిరుపాల రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో వేద చతుర్వేద పారా యణం నడుమ చామంతి,వృక్షి, సంపంగి, గన్నేరు, గులాబీ,మల్లె, మొలలు, కనకాంబర, తామర, కలువ, మొగలి, మనుసంపంగి, మరువం, ధమనం, బిల్వం, తులసి వంటి 12 రకాల పుష్పాలను స్థానిక దేవస్థానం వద్ద నుంచి ప్రారంభమై గోవింద నామాలను స్మరిస్తూ మంగళ వాయిద్యాల మధ్య స్వామి సన్నిధికి తీసుకెళ్లి పుష్పాభిషేకం చేశారు.ఇది చూపరులను కనువిందు చేసింది.
ఈ కార్యక్రమాలను తిరుచానూరు అమ్మవారి ఆలయం అర్చకులు శ్రీ బాలాజీ స్వామి వేదపండితుల ఆధ్వ ర్యంలో తొలుత స్వామి వారి ఆలయసన్నిధిలో శాస్త్రో క్తంగా హోమం నిర్వహించారు.అనంతరం పుష్పయాగం జరిగింది.ఈ సందర్భంగా టీటీడీ సంగీత కళాకారులు యం.బి.లోకనాధంరెడ్డి,యం.హేమమాలిని ఆధ్వర్యం లో గోష్ఠిగానం నిర్వహించారు.వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా హాజరై పూజలో పాల్గొన్నారు.పుష్పా భిషేకం అనంతరం భక్తులకు పుష్పాలని పంపిణీ చేశారు.ఆలయ పరిసర ప్రాంతాలల్లో చలువ పందిళ్లు వేసి,రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

