32.7 C
Hyderabad
March 29, 2024 12: 50 PM
Slider ప్రపంచం

మెట్లపై నుంచి పడిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్

#putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజా సమాచారం ప్రకారం మాస్కోలోని తన అధికారిక నివాసంలో పుతిన్ మెట్లపై నుండి జారిపడిపోయారు. ఐదు అడుగుల ఎత్తు నుంచి ఆయన కిందికి పడిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్ర గాయం అయినట్లు చెబుతున్నారు. పుతిన్ పడిపోయారని టెలిగ్రాఫ్ ఛానెల్ తన నివేదికలో పేర్కొన్నట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ఇప్పటికే ఆయన కడుపు మరియు ప్రేగు క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. అటువంటి పరిస్థితిలో జరిగిన ఈ ప్రమాదం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చునని అంటున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆయనను పర్సనల్ గార్డ్స్ పైకి లేపి, క్లీన్ చేసిన తర్వాత చికిత్స ప్రారంభించారని నివేదిక పేర్కొంది. వెన్నెముక దిగువ కోకిక్స్ భాగంలో నొప్పి కారణంగా, ఆయన కూర్చోవడం కష్టంగా ఉందని అంటున్నారు.

Related posts

సీతమ్మ చలివేంద్రం భూములపై కన్నేసిన తోడేళ్ల గ్యాంగ్

Bhavani

హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైసీసీ పార్టీ

Satyam NEWS

త్రిబుల్ ఆర్ లో ఉన్నవి మూడు పాటలేనా?

Satyam NEWS

Leave a Comment