39.2 C
Hyderabad
April 23, 2024 17: 17 PM
Slider ముఖ్యంశాలు

సీఎం కేసీఆర్ ప్రకటనపై పివి కుటుంబం ఆనందం

#PVNarasimharao

భారత మాజీ ప్రధాని స్వర్గీయ పి.వి.నరసింహారావుకు భారత రత్న ప్రదానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో తీర్మానిచడం గొప్ప విషయంగా పి.వి.కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు.

పి.వి.సోదరులు పి.వి.మనోహర్ రావు, పి.వి.కుమారుడు పి.వి.ప్రభాకర్ రావు, మనవడు రాఘవేంద్ర కాశ్యప్, పి.వి.సోదరుల కుమారులు పి.వి.మదన్ మోహన్, సీతారామ రావు, శరత్ బాబు, రాజ్ మోహన్ కేసీఆర్ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేశారు.

వంగర గ్రామ సర్పంచ్ రజితా గోపాల్, ఎంపిటీసి కౌసల్య ఉప సర్పంచ్ రాజు, యంఆర్బీ డైరెక్టర్ వెంకట రెడ్డి, మాజీ డైరెక్టర్లు సతీష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, గ్రామాభివృద్ధి ఉపాధ్యక్షులు శ్రీరామోజు మొండయ్య,సభ్యులు,   క్రుష్ణం రాజు,కోఆప్షన్ సభ్యులు దస్తగిరి యంఆర్పియస్ నాయకులు కండె రమేశ్, సుధాకర్, చక్రపాణి, వెంకటస్వామి, వార్డు సభ్యులు సతీష్,అశోక్, దొంత అశోక్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

శాసన సభలో అతి ముఖ్యమైన సమయాన్ని స్వర్గీయ పి.వి. కోసం  కేటాయించి రాష్టానికి,దేశానికి ఆయన చేసిన సేవల గురించి చర్చించే అవకాశం ఇవ్వడం హర్షణీయమని వారు అన్నారు.

గత జూన్ 28న పి.వి శతజయంతి కార్యక్రమాలు ప్రారంభించి యంపీ కేశవరావు అధ్యక్షతన కమీటీ ఏర్పాటు చేశారు. ఏడాది పొడవునా మన దేశంతో పాటు ప్రపంచ దేశాలలో ఈ వేడుకల నిర్వహణకు ప్రణాళికలు ఖరారు చేశారు.

పి.వి.స్వస్థలం వంగర, పుట్టిన ఊరు లక్నేపల్లి గ్రామాలను టూరిజం సర్క్యూట్లుగా అభివృద్ధి చేసే దిశగా సంబంధిత మంత్రి శ్రీనివాస గౌడ్,ఇతర అధికారులను ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు.

Related posts

ఎంతో వైభవంగా సాగుతున్న దేవీ నవరాత్రులు

Satyam NEWS

ములుగు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఎన్నిక

Satyam NEWS

క్రీడలు శారీరక దృఢత్వానికి, మనసిక ఉల్లాసానికి దోహదపడతాయి

Satyam NEWS

Leave a Comment