32.2 C
Hyderabad
March 29, 2024 00: 22 AM
Slider విజయనగరం

నాణ్యమైన వస్త్రాలు- సరసమైన ధరలు..ఆకట్టుకుంటున్న చేనేత ప్రదర్శన

వస్త్రాల లో చేనేత కు ఉండే ప్రధాన్యతే వేరు. ధరించేవారికి సౌకర్యం, చూసే వారి కళ్ళకు హుందాతనం చేనేతకే స్వంతం. పట్టు వస్త్రాలను కూడా నేతన్నలు మగ్గాల పై వారి నైపుణ్యం చూపుతూ లేటెస్ట్ వెరైటీ లను తయారు చేస్తున్నారు. అనేక వెరైటీ లు ఒకే చోట రాసి పోసినట్లుగా అందుబాటులో ఉంటూ మగువల మనసులను దోచేస్తున్నాయి.

మహిళలు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో స్థానిక మెసోనిక్ టెంపుల్ నందు ఏర్పాటు చేసిన రాష్ట్ర చేనేత ప్రదర్శనకు మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్రం నలు మూలల నుండి చేనేత ళాకారులచే మగ్గాల పై తయారు చేసిన చేనేత వస్త్రాలు మహిళల మనసులను దోచుకుంటున్నాయి. ఈ ప్రదర్శనలో 60 స్టాల్స్ లో చెందేరి, ధర్మవరం, వెంకట గిరి, మంగళగిరి, చీరాల, మచిలీపట్నం , కడప, నారాయణ్ పేట, ఉప్పడ, పోచంపల్లి సిద్ధిపేట కాటన్, పెద్దాపురం, కుప్పడం, వరంగల్ డర్రీస్, పొందూరు ఖాదీ, పార్వతీపురం, కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్ , దుబాటులో ఉన్నాయి . ముఖ్య0గా మహిళా ఉద్యోగుల కోసం లైట్ వెయిట్ చీరలు పట్టు , కాటన్ వెరైటీ లు మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరలకే లభిస్తున్నాయి. చీరలు, డ్రెస్ మెటీరియల్స్ తో పాటు జైపూర్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ , మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన బెడ్ షీట్స్ , డోర్ మాట్స్ , ఫ్లోర్ మాట్స్ తదితర గృహ అలంకార సామాగ్రి కూడా చక్కటి డిసైన్లతో సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నాయి. వివాహాది శుభ కార్యాలకు అవసరమగు జరీ చీరలు, సాదా చీరలు, చెందేరి తదితర లేటెస్ట్ వెరైటీలు ప్రదర్శనలో లభ్యంగ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ సూర్య కుమారి స్టాల్స్ ను సందర్శించారు. అధికారులలంతా కుటుంబాలతో కలసి సందర్శించాలని కోరారు. తద్వారా చేనేత కార్మికులకు చేయూత నిఛ్చినట్లవుతుందని తెలిపారు.

సెలవు రోజుల్లో కూడా ప్రదర్శన:: జిల్లా చేనేత జౌళి అధికారి మురళీ కృష్ణ

ఈ నెల 17 వ తదీ వరకు సెలవు రోజుల్లో కూడా ప్రదర్శన ఉంటుంది. సుమారు 60 లక్షల వరకు విక్రయాలు జరగవచ్చని అంచనా వేస్తున్నాం. మన్నిక గల వస్త్రాలు , మగ్గం ధరలకే విక్రయించడం జరుగుతోంది. అన్ని వయసుల వారికీ, అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ నుండే కాకుండా పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, చత్తీస్ఘడ్ నుండి కూడా ప్రత్యేక డిసైన్ చీరలు, బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకే చోట అనేక వెరైటీలు లభించడం తో మంచి స్పందన వస్తోందని అంటోంది “సత్యం న్యూస్. నెట్”.

Related posts

తిరుచ్చి పై మాడ వీధుల్లో సౌమ్యనాధ స్వామి…

Satyam NEWS

విజయోత్సవ ర్యాలీ కి తరలి వెళ్ళిన బీజేపీ కార్పొరేటర్లు

Satyam NEWS

వనపర్తి టౌన్ ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన యుగంధర్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment