28.7 C
Hyderabad
April 20, 2024 05: 25 AM
Slider వరంగల్

క్వారంటైన్ కేంద్రాలు రేపటి నుండి ములుగు జిల్లాలో పునఃప్రారంభం

#mulugudist

రాష్ట్రంలో రెండో విడత కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ములుగు జిల్లాలో రెండు క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు.

జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు జిల్లాలో ముందస్తుగా కోవిడ్ పాజిటివ్ కేసుల చికిత్స నిమిత్తం రెండు క్వారంటైన్ కేంద్రాలను రేపటి నుండి  పునఃప్రారంభిస్తున్నామని డి ఎం హెచ్ ఓ తెలిపారు.

క్వారంటైన్ కేంద్రాల వివరాలు 1.జాకారం 2. ఏటూరునాగారం

వై టి సి జాకారం క్వారంటైన్ కేంద్రంలో 100 వంద పడకల సామర్థ్యం ఉందని, YTC ఏటూర్ నాగారం లో 75 పడకల సామర్థ్యం ఉందని ఆయన తెలిపారు.  భోజన వసతులు తో అన్ని రకాల సదుపాయాలు అందడం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు డిఎంఅండ్హెచ్ఓ తెలిపారు.

ఈ రోజు వైద్య బృందంతో వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో ఏప్రిల్ 1వ తారీకు నుండి 45 సంవత్సరాల పైబడిన వాళ్ళకి covid 19 వ్యాక్సినేషన్ కొరకు, 16 కేంద్రాల్లో సిద్ధం చేసినప్పటికీ ఎక్కువ సంఖ్యలో టీకాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని ఆయన తెలిపారు.

ఎక్కువ సంఖ్యలో టీకాలు తీసుకునే విధంగా, ఇతర శాఖల అధికారులు ,ప్రజా ప్రతినిధులు ,స్వచ్ఛంద సంస్థలు, ద్వాక్రా గ్రూప్, సభ్యులు యూత్, ప్రజలు వారు టీకాలు తీసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వారికి విజ్ఞప్తి చేశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్యాధికారులు సిబ్బంది ప్రతి గ్రామంలో టీకాలు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని అని వారికి,ఆదేశించడం జరిగింది.  జిల్లా రాపిడ్ రెస్పాన్స్ టీం సభ్యులు, తిరుపతయ్య, ప్రతాప్,  ఇంతకు ముందు క్వారంటైన్ కేంద్రంలో పని చేసిన ఆరోగ్య సిబ్బంది వారి వెంట ఉన్నారు.

Related posts

గవర్నర్ తో ‘‘సై’’ అంటున్న అధికార పక్షం

Satyam NEWS

ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

Satyam NEWS

కార్పోరేట్ సంస్థల కోసమే ఈ కొత్త వ్యవసాయ చట్టాలు

Satyam NEWS

Leave a Comment