24.7 C
Hyderabad
October 26, 2021 03: 58 AM
Slider వరంగల్

ప్రశ్నించే గొంతుకను విమర్శిస్తే ఊరుకునేది లేదు..

#mulugucongress

ఐటిడిఏ లో జరుగుతున్న అవకతవకలను ములుగు ఎమ్మెల్యే సీతక్క అడ్డుకోవడం లేదని ఆదివాసీ తుడుమ్  దెబ్బ విద్యార్ది సంఘ  రాష్ట్ర అధ్యక్షులు దబ్బకట్ల  సుమన్ ఆరోపించడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అయ్యరి యానయ్య  అన్నారు.

మంగళవారం రోజున మంగపేట  మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి సంఘం అని చెప్పుకోవడం కాదు అందరికీ ఆదర్శంగా ఉండాలని, అధికార పార్టీకి తొత్తులుగా మారి సీతక్క పై తప్పుడు ఆరోపణలు చేయడం ఆయన తెలివి తక్కువ తనానికి నిదర్శనమని అన్నారు 

అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని దుయ్యబట్టారు. చేతనైతే అధికార పార్టీ కి చెందిన గిరిజన మంత్రి నిలదీయాలని అన్నారు. అంతే కానీ ఒక ఆదివాసి ఎమ్మెల్యే నిత్యం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న సీతక్కను విమర్శించడం మంచిది కాదని అన్నారు. ఎన్నోసార్లు అసెంబ్లీలో ఏజెన్సీ ప్రాంత రోడ్ల, పోడు భూముల అన్నీ రకాల సమస్యల కోసం సీఎం ని ప్రశ్నించిన  ప్రతిపక్ష ఎమ్మెల్యేను విమర్శించడం ఎంతవరకు సబబు అని అన్నారు.

రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా విద్యార్థులకు ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మేడారం జాతర వస్తున్నందున అధికార పార్టీ మెప్పు పొందాలని ఇలాంటి చౌకబారు నీచ రాజకీయాలు చేయడం వెనుక అంతరార్ధం ఏమిటో తమకు తెలుసు అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ములుకుట్ల నరేందర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు హిదయతుల్లా, బీసీ సెల్ అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, మైనార్టీ జిల్లా నాయకులు  మెహబూబ్ ఖాన్, సీనియర్ నాయకులు కారు పోతులు నర్సయ్య గౌడ్, దామెర సారయ్య, ఆక తిరుమల రావు, పిండిగ నాగరాజు, ఊకే అజయ్ కుమార్, మండల సర్వయ్య, కోరం లక్ష్మీపతి,  నాగార్జున, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హమ్మయ్య..అన్నట్లుగా జరిగిన పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవం…!

Satyam NEWS

ప(ప్ల)వనం

Satyam NEWS

శ్రీశైల పుణ్య క్షేత్రంలో కూష్మాండదుర్గ అలంకారం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!