35.2 C
Hyderabad
April 24, 2024 12: 52 PM
Slider వరంగల్

ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్విజ్ అండ్ వ్యాసరచన పోటీలు

#Mulugu Lions Club

ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ములుగు బాయ్స్ హై స్కూల్ లో క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ములుగు వెంకటాపూర్ మండలాల నుంచి 8 హై స్కూల్ నుండి 8 టీములు పాల్గొన్నాయి. ఈ క్విజ్ పోటీలను లయన్ కె చంద్రశేఖర్ ఆర్య, డిస్టిక్ మార్కెటింగ్ కోఆర్డినేటర్, జి ఏ టి మెంబర్ నిర్వహించారు. ములుగు బాయ్స్ హై స్కూల్, జడ్.పి.హెచ్.ఎస్ నర్సాపూర్, జడ్.పి.హెచ్.ఎస్ బండారుపల్లి, జడ్.పి.హెచ్.ఎస్ మల్లంపల్లి, జడ్.పి.హెచ్.ఎస్ వెంకటాపూర్, టీఎస్ మోడల్ స్కూల్

బండారుపల్లి, ములుగు బాయ్స్ స్కూల్, సన్రైజర్స్ హై స్కూల్ ములుగు ఈ పోటీలలో పాల్గొన్నాయి. హైస్కూల్ స్థాయి పాఠ్యాంశాల తెలుగు సోషల్ సైన్స్ నుండి, జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి నిర్వహించారు. జడ్పీహెచ్ఎస్ వెంకటాపూర్ ప్రధమంగా, ద్వితీయంగా జడ్.పి.హెచ్.ఎస్ మల్లంపల్లి నిలిచినది. వీరిని డిస్ట్రిక్ట్ స్థాయిలో నిర్వహించే క్విజ్ పోటీలకు ఎంపిక చేశారు. విజేతలకు ములుగు డిఆర్ఓ కే. రమాదేవి బహుమతులు ప్రధానం చేశారు. జనవరి 5వ తారీఖున

నిర్వహించిన వ్యాసరచన పోటీ విజేతలు జె దివ్య ప్రథమ బహుమతి 3016/-రూపాయలు షీల్డ్, ప్రశంసా పత్రం, రెండవ బహుమతి ఓరుగంటి ప్రియా జడ్.పి.హెచ్.ఎస్ మల్లంపల్లి 2016/- రూపాయలు షీల్డ్, ప్రశంస పత్రం, మూడవ బహుమతి జెడ్పిహెచ్ఎస్ వెంకటాపూర్ సిహెచ్ పూజిత లకు 1016/-రూపాయలు షీల్డ్ ప్రశంస పత్రం లను డిఆర్ఓ రమాదేవి మరియు లయన్ డాక్టర్ ఆర్య ఇచ్చారు. డిఆర్ఓ రమాదేవి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ఇలాంటి పోటీలు పెట్టడం వలన వారిలో ఆలోచన శక్తి పెరుగుతుందని కాంపిటేషన్ పై అవగాహన వస్తుందని అన్నారు.

లయన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థుల ప్రతిభ పాట వెలికి తీసేందుకు ఈ పోటీ నిర్వహించడం జరిగిందని అన్నారు గెలుపొందిన విద్యార్థులను జిల్లా స్థాయిలో ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బద్దం సుదర్శన్ రెడ్డి క్వాలిటీ కోఆర్డినేటర్ ఏ విజయమ్మ డి సి ఈ వి సెక్రటరీ ములుగు లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చుంచు రమేష్ డిస్టిక్ చైర్ పర్సన్ కొండి సాంబశివ, కోశాధికారి మెరుగు రమేష్, మార్గం ప్రేమలత ప్రభాకర్, దండే ప్రవీణ్ విద్యార్థి, ఏళ్ళ మధుసూదన్, శిరుప సతీష్ కుమార్, రాజేందర్ చెవుల మహేశ్, నాగేశ్వరరావు, పాడియా రవి, నజీరోద్దీన్,మల్లయ్య, వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ప్రభాస్ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా ముషిణి విక్రమ్

Satyam NEWS

జ్ఞాన దీప్తి మనలను వదిలేసి అమరలోకానికి వెళ్లిపోయింది

Satyam NEWS

త్వరలో జిల్లా ఆసుపత్రులను సందర్శిస్తాం

Satyam NEWS

Leave a Comment