39.2 C
Hyderabad
March 29, 2024 14: 16 PM
Slider సినిమా

రావికొండలరావుకు జీవిత సాఫల్య పురస్కారం

chiru

తెలుగు సినీ రచయితల సంఘం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవవేడుకలు ఆదివారంనాడు ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగాయి. ముందుగా భలభద్రపాత్రుని రమణి తొలిపలుకులతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆకెళ్ళ కార్యదర్శి నివేదిక సమర్పించారు. ముఖ్య అతిథి గా హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి సీనియర్‌ రచయితలైన ఆదివిష్ణు, రావికొండలరావు, సత్యానంద్‌, భువనచంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ సినీపరిశ్రమలో దర్శ నిర్మాతల తర్వాత అత్యధికంగా గౌరవించిచేది, సన్నిహితంగా వుండేది రచయితలతోనే. పరుచూరి బ్రదర్స్‌, సత్యానంద్‌గారికి అది తెలిసిందే.

అంతటి గౌరవాన్ని ఇస్తుంటాను. రచయితలే లేకపోతే మేం లేం అనేది వాస్తవం. మొన్నీమధ్య దీపావళికి మోహన్‌బాబు ఇంటికి వెళ్ళాం. అందమైన వెండి సింహానం వుంది. అది చూడగానే.. సత్యానంద్‌ను రాఘవేంద్రరావు కూర్చో పెట్టారు. అది చూశాక.. కరెక్టేకదా.. ఆ స్థానం అలంకరించే అర్హుడు అనిపించింది. ఒక్క సత్యానంద్‌నేకాదు రచయితలందరూ గౌరవించేదిగా వుంటుంది. ఈ విషయమై సరదాగా మోహన్‌బాబుగారు ఓ మాట అన్నారు. రాఘవేంద్రరావును నిలబెట్టి సత్యానాంద్‌ను కూర్చొపెట్టడం ఏమిటని.. అప్పుడు.. నేనన్నాను.

రాఘవేంద్రరావు శిల్పి. అది చెక్కాలంటే తగిన రాయికావాలి. అది కంటెంట్‌. ఆ కంటెంట్‌ సత్యానంద్‌.. అందుకే గౌరవించుకోవడం జరిగిందని.. సరదాగా మాట్లాడుకున్నాం. ఇదంతా రచయితలతో నాకున్న అనుబంధం. పరుచూరి బ్రదర్స్‌తో అనుబంధం చాలా వుంది. కుటుంబ సభ్యుల్లా అయిపోయాం. ఇంకా సింగీతం శ్రీనివాసరావు, విశ్వనాథ్‌గారు కూడా వచ్చివుంటే బాగుండేది. అది లోటుగా భావిస్తున్నా. వారిద్దరు మనకు నిధి లాంటివారు. మాయాబజార్‌నుంచి ఈ కాలంవరకు వున్న వ్యక్తులు. వారు రాలేకపోయారు.

ముందుముందు వారిని సన్మానించుకునే అవకాశం నాకు ఇవ్వగలిగాతే బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు సినీ నీరాజనం ఏవీ లాంఛ్‌ చేశారు. అనంతరం రాఘవేంద్రావు మాట్లాడుతూ… రాబోయే దర్శకులకు కష్టకాలం వచ్చింది. అందరూ రచయితలు దర్శకుడులయ్యారు. అందకనే కొత్త రచయితల్నే నమ్ముకోవాల్సిందే.. నేను పరిచయం చేసిన రయితలందరూ  ముఖ్యంగా సత్యానంద్‌, పరుచూరి బ్రదర్స్‌, భారవి, హరనాథ్‌బాబు, జంథ్యాల ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు. మోహన్‌బాబు లివింజ్‌లెజెండ్స్‌ ఏవీ లాంఛ్‌ చేశారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ…  రచయితలు సరస్వతీ పుత్రులు. వీరిని సన్మానించే కార్యక్రమంలో పాల్గొంటానని కలలో కూడా వూహించలేదు. నా జీవితంలో చాలా విషయాలున్నాయి. మొట్టమొదట.. నేను అప్రెంటీస్‌గా పనిచేసింది ఎం.ఎం. భట్‌.. గారి దగ్గర. అక్కడే శ్రీశ్రీగారు పరిచయం. ఆ తర్వాత ఆరుద్రగారు.. ఇలా ఎంతోమంది నాకు పరిచయం. అలాంటి ఆరుద్ర ఎన్నో సిల్వర్‌జూబ్లీలు ఇచ్చారు. కానీ ఆయన చివరిరోజు ఏ నిర్మాత రాలేదు. నేను మొదట వేషం కావాలని వెంటపడింది సత్యానంద్‌గారి దగ్గరే. ఆ విషయాలను గుర్తుచేసుకుంటే ఆనంద భాష్పాలు వస్తుంటాయి.

అలాంటి వ్యక్తిని నా చేతులమీదుగా సన్మానించుకోవడం దేవుడిచ్చిన అదృష్టం. నాకు తండ్రిలాంటి దాసరి, సోదరుడు రాఘవేంద్రావు. ఇలా ఆ దర్శకుల ఆశీస్సులతో ఈ స్తితిలో ఉన్నా. ఎందరో మేథావులు ఇండస్ట్రీలో వున్నారు. మా లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌కు మొదట సత్యానంద్‌గారు మాటలు రాశారు. ఒళ్ళుపులకరించే డైలాగ్స్‌లు రాసేవారు. పరుచూరి బ్రదర్స్‌ అద్భుతంగా రాశారు.

ఈ కార్యక్రమంలో విశిష్ట రచనా పురాస్కారాలు ఆకుల చంద్రబోసు, సుద్దాల, జెకె. భారవి, ఆకుల చిన్నికృష్ణ, వీణాపాణి, అనంత్‌ శ్రీరామ్‌, భాస్కరభట్ల, తైతలబాపు, భారతీబాబు, జొన్నవిత్తుల రామలింగేశ్వరావు, త్రివిక్రమ శ్రీనివాస్‌, వక్కంతం వంశీ, బుర్రా సాయిమాధవ్‌, రామజోగయ్య శాస్త్రి, బలభద్రపాత్రుని రమణి, మాధవ పట్నాయక్‌ (జడ్జి), ఎస్‌వి రామారావు, పరుచూరి వెంకటేశ్వరావు, తోటపల్లి సాయినాధ్‌, ఆకెళ్ళ, గద్దర్‌, సాహితీ, సిరివెన్నెల సీతామారాశాస్త్రి, భూపతిరాజా, అందెశ్రీ, దివాకరబాబు, శివశక్తి దత్త, గోరేటి వెంకన్న, మరుధూరి రాజా, తోటపల్లి మధు, సంజీవి మొదలి, జనార్దన మహర్షి, పోసాని కృష్ణమురళీ, రాజేంద్రకుమార్‌, చింతపల్లి రమణ, ఆకుల శివ, ఎం. రత్నం, లక్ష్మీభూపాల్‌ అందజేశారు. తనికెళ్ళ భరణి, డా.పాలకేడేటి సత్యనారాయణ, విజయేంద్రప్రసాద్‌లకు గౌరవ పురస్కారాలు అందజేశారు. [14:55, 03/11/2019] AH Chief Reporter Ramakrishna: ప్రవీణ్ ప్రకాష్ 1994వ సంవత్సరం బ్యాచ్ కు  చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఎక్కడ పనిచేసినా ఎదో ఒక వివాదంలో చిక్కుకోవటం ఆనవాయితీగా వస్తోంది.ప్రవీణ్ ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుందని ఉత్తరప్రదేశ్ కు  చెంది ఉమ్మడి మనరాష్ట్రంలో పనిచేసి పదవీ విరమణపొందిన ఐఏఎస్ అధికారి ఆయన సమక్షంలోనే వ్యాఖ్యానించటం చాలా  అరుదైన సంఘటన.ఈయన కూడా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రా

Related posts

విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద రణరంగం….!

Satyam NEWS

స్కూళ్లకు దసరా సెలవుల పొడిగింపు సరికాదు

Satyam NEWS

మార్కాపురం ఎమెల్యే సీటు కోసం “ఉడుముల”

Satyam NEWS

Leave a Comment