37.2 C
Hyderabad
April 19, 2024 11: 12 AM
Slider మహబూబ్ నగర్

విద్య, వైద్యం కోసం రాచాల భరోసా యాత్ర

#rachala

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్

మనకు కష్టం వస్తే ముందు అది తీర్చే వాళ్ల కన్నా ఆ సమయంలో అండగా నిలబడి ధైర్యం ఇచ్చే వాళ్ల కోసమే చూస్తాం.

నా దేవరకద్రకు విద్యా వైద్యం అనే కష్టం వచ్చింది…నేను ఆ దైర్యం లెక్క నిలబడతా…ఆ కష్టం తీరేదాకా పోరాడుతా…దేవరకద్ర లో విద్యా వైద్యం కోసమే నా  యుద్దమని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ పేర్కొన్నారు.

ఆదివారం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో భరోసా యాత్రకు సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు విద్య వైద్యం ఉచితంగా అందించాలని, హక్కుగా రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ నేటికీ అమలు కావడం లేదని, 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో విద్య వైద్యం కొనుగోలు చేయాల్సిన దుస్థితిని పాలకులు కల్పించారన్నారు.

ఇకనుంచి ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతోనే దేవరకద్ర నియోజకవర్గంలో మే 12 నుంచి  పాదయాత్ర  నిర్వహిస్తున్నానని, నా పాదయాత్ర ద్వారా నియోజకవర్గంలో ఉన్నత విద్య వైద్యం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ పాదయాత్రలో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు కావలి మధులత, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు గౌడ్,కొత్తకోట మండల అధ్యక్షుడు అంజన్న యాదవ్, మదనాపూర్ మండల అధ్యక్షుడు మహీందర్ నాయుడు, సీసీ కుంట మండల అధ్యక్షుడు చంద్రకాంత్, వనపర్తి మండల కన్వీనర్ తిరుపతయ్య గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ రఘునాథ్ గౌడ్ రాములు  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

కంచరపాలెంలో రౌడీషీటర్ దారుణ హత్య

Satyam NEWS

రజనీకాంత్ ” జైలర్ ” కలెక్షన్ల ఊచకోత

Bhavani

భారీ వర్షం లో తరంగగానం వర్క్ షాప్ ముగింపు ఉత్సవం

Satyam NEWS

Leave a Comment