వనపర్తి జిల్లా పౌర సరఫరాల సంస్థ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వై పి రమేష్ ను బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ సన్మానించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో ఆయనను కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో వనపర్తి సివిల్ సప్లయ్ అధికారిగా పనిచేసిన ఇర్ఫాన్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, అతడిని బదిలీ చేయాలని బిసి పొలిటికల్ జెఎసి డిమాండ్ చేయడంతో గురువారంనాడు ప్రభుత్వం అతనిని మహబూబ్ నగర్ జిల్లాకు రిలీవ్ చేసి అయన స్థానంలో వై పి రమేష్ ను నియమించింది. ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జెఎసి నాయకులు రాఘవేందర్ గౌడ్, అంజన్న యాదవ్, మహిందర్ నాయుడు, శివ శంకర్ గౌడ్, మ్యాదరి రాజు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్