యాక్షన్ మూవీ కాదు.. మహిళ ప్రధాన పాత్రతో కథనం నడుస్తుంది…అని రాచరికం సినిమా యూనిట్ తెలిపింది. కడప దర్గా కు వెళ్లి ప్రార్థనలు చేసి వచ్చిన అనంతరం రాచరికం సినిమా యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. డైరక్టర్ సురేష్ లంకల పల్లి, ఈశ్వర్ వాసే, ప్రొడ్యూసర్ ఈశ్వర్, హీరోయిన్ అప్సర రాణి మాట్లాడారు. ఈ సందర్భంగా అప్సర మాట్లాడుతూ తొలిసారి కడపకు వచ్చాము.. ఇది నా తొలి సినిమా.. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆదరించాలని కోరుతున్నా.. అని అన్నారు. హీరో జయ శంకర్ మాట్లాడుతూ రాచరికం టీం ప్రమోషన్ కోసం వచ్చాం..ఒక రోజు కడపలో స్టే చేస్తున్నాం.. రాయలసీమ నేపథ్యంలో తీసిన సినిమా ఇది.. ఇప్పటి వరకు ఎవరూ చూపని ఇతివృత్తం తో తీసాను.. బడ్జెట్ ఎక్కువ.. చాలా రిస్క్ తీసుకున్నాం.. ఒక కొత్త విషయాన్ని ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నం చేశాం.. కమర్షియల్ లైన్ అన్నా అందరూ చూసి, ఆనందించే లా తీశాం..యూత్, కొన్ని వర్గాలు ఓన్ చేసుకునేలా క్యారెక్టర్లు ఉంటాయి.. ఇందులో మహిళా సాధికారిత ను అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం.. మీడియం ధియేటర్ రైట్స్ కూడా తీసుకోవడం ఒక గొప్ప పరిణామం. వరుణ్ సందేశ్…నటన చాలా గొప్పగా చూస్తారు..కొత్త కోణంలో ఉంటుంది అని అన్నారు.