30.7 C
Hyderabad
April 19, 2024 08: 27 AM
Slider ముఖ్యంశాలు

నిను వీడని నీడను లే: రఘురామ మరో అస్త్రం

#Raghurama

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. దేశ ద్రోహం కేసు పెట్టిన ఏపి సిఐడి పోలీసులు ఆయనను అరెస్టు చేయగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాకప్ లో తనను చిత్ర హింసలు పెట్టారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.

ఇప్పటికే ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించిన పలువురు పోలీసు అధికారులుపై ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ప్రభుత్వం తరపున వాదించిన ఎడ్వకేట్లపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై ఏపీ బార్ కౌన్సిల్‌కి ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వం నుంచి జీతంతో పాటు అన్ని వసతులు పొందుతూ టీవీ 9, సాక్షి ఛానళ్లలో తనపై నోటికి వచ్చినట్లు మాట్లాడారని రఘురామ ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన ఏఏజీ పదవిలో ఉండి తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని రఘురామ ఫిర్యాదు చేశారు.

సుధాకర్‌రెడ్డి న్యాయవాద వృత్తికి అనర్హుడని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుధాకర్‌రెడ్డిపై వెంటనే చర్యలు చేపట్టాలని బార్ కౌన్సిల్‌‌ను రఘురామకృష్ణంరాజు కోరారు.

Related posts

అనాథబాల

Satyam NEWS

కన్నుల పండువగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం ముగింపు

Satyam NEWS

నవాజ్ షరీఫ్ ను లండన్ పంపడం తప్పే

Satyam NEWS

Leave a Comment