22.2 C
Hyderabad
December 10, 2024 10: 03 AM
Slider జాతీయం

కాశ్మీర్ స్పీకర్ గా రహీమ్ రాథర్

#abdulraheemradhar

జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ స్పీకర్‌ గా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ ఎన్నికయ్యారు. అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బుద్గాం జిల్లాలోని చరార్‌-ఇ-షరీఫ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేడు తొలిరోజు సభను ఉద్దేశించి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రసంగించనున్నారు. స్పీకర్‌ పదవికి పోటీ చేయకూడదని ప్రతిపక్షాలు నిర్ణయించడంతో మూజువాణి ఓటుతో అబ్దుల్‌ రహీమ్‌ రాథర్‌ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌ ముబారక్‌ గుల్‌ ఎన్నికలు నిర్వహించారు.

వ్యవసాయ మంత్రి జావేద్‌ అహ్మద్‌ దార్‌ స్పీకర్‌ పదవికి అబ్దుల్‌ రహీమ్‌ను ఎంపిక చేయాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఎన్‌సి ఎమ్మెల్యే రాంబన్‌ అర్జున్‌ ఈ తీర్మానాన్ని బలపరిచారు. ఎన్నికల అనంతరం, శాసనసభ అధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా, ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్‌ శర్మలు అబ్దుల్‌ రహీమ్‌ వెంట వెళ్లగా ఆయన స్పీకర్‌ కుర్చీని అధిరోహించారు. నేటి నుండి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అబ్దుల్‌ రహీమ్‌ గతంలో కూడా జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీలో స్పీకర్‌ పదవిని చేపట్టారు. పిడిపి-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో 2002-2008 వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. 2018లో చివరిగా జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.

ఆరేళ్లకు పైగా విరామం తర్వాత నేడు అసెంబ్లీ సమావేశమైంది.ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్‌సీ పార్టీ భారీ విజయం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరింది. ఈ క్రమంలోనే దాదాపు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి.

Related posts

అంబటి జగన్ ను వీడి వెళ్లడానికి వెనుక అసలు కథ ఇది

Satyam NEWS

చుక్కలను చూపిస్తున్న పసుపు, కుంకుమ ధరలు…

Satyam NEWS

సుగంధ ద్రవ్యాలతో వేడుక‌గా శ్రీ‌నివాసునికి స్న‌ప‌నం

Satyam NEWS

Leave a Comment