34.2 C
Hyderabad
April 19, 2024 21: 09 PM
Slider ముఖ్యంశాలు

బివేర్: రహేజా మైండ్ స్పేస్ లో కరోనా కలకలం

raheja-mindspace

హైదరాబాద్ ను కరోనా వైరస్ చుట్టుముట్టేసినట్లే కనిపిస్తున్నది. అనుమాన భయంతో స్కూళ్లు కూడా మూసేస్తుండగా సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోం మెదలు పెట్టాయి. ప్రతిష్టాత్మక మైండ్ స్పేస్ బిల్డింగ్ నంబర్ 20 లో వున్న డిఎస్ ఎం కంపెనీలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. 

దాంతో 9వ ఫ్లోర్ లో వున్న ఈ కంపెనీ లో ఇవాళ ఉద్యోగులు ఎవరూ కూడా హాజరు కాలేదు ఉద్యోగులు కేవలం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇదే ఫ్లోర్ లో వున్న ఓపెన్ టెక్స్ట్ ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ 19 పై మీడియా బులిటెన్ విడుదల చేసింది.

దాని ప్రకారం గాంధీ హాస్పటల్ లో 47 మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 45 మందికి వైరస్ లేదని నిర్ధారణ అయ్యింది. మరో ఇద్దరికి సంబంధించిన శాంపిల్స్ ను పూణే కి పంపించారు. ఇద్దరిలో ఒకరు ఇటలీ నుంచి  వచ్చిన విదేశీ వ్యక్తి. మరొకరు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. పూర్తిస్థాయి నిర్ధారణ కోసమే పూణేకు పంపించారు. కరోనా వైరస్ పాజిటివ్ గా ఉన్న వ్యక్తి  గాంధీ హాస్పిటల్ లో ఇసొలేషన్ లో ఉన్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.

Related posts

బీసీసీఐ కు షాకిచ్చిన ఆఫ్గాన్ తాలిబాన్లు

Sub Editor

ఆస్తుల నమోదులో పురోగతి సాధించాలి

Satyam NEWS

లాయల్టీ బోనస్: కడప జడ్పీ చైర్మన్ గా ఆకేపాటి అమర్ నాధ రెడ్డి

Satyam NEWS

Leave a Comment