28.2 C
Hyderabad
April 20, 2024 13: 02 PM
Slider జాతీయం

పరువు నష్టం కేసులో హాజరు నుంచి రాహుల్ కు మినహాయింపు

#RahulGandhi

పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి అహ్మదాబాద్ కోర్టు వెసులుబాటు కల్పించింది.

లోక్ సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ అప్పటి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై తీవ్ర ఆరోపణలు చేశారు.

అమిత్ షా ఒక హంతకుడు అని రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడంతో ఆ ఆరోపణలపై బిజెపి కార్పొరేటర్ కృష్ణవందన్ బ్రాంభట్ అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పరువునష్టం దావా వేశారు.

షోరాబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసు నుంచి అమిత్ షాకు 2015 లోనే విముక్తి కలిగిందని అయినా అదే విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారని కృష్ణవందన్ తెలిపారు.

అయితే తాను కేరళలోని వయనాడ్ కు పార్లమెంటు సభ్యుడుగా ప్రాతినిధ్యం వహిస్తున్నందున తాను కోర్టుకు హాజరు కాలేనని రాహుల్ గాంధీ కోర్టుకు విన్నవించుకున్నారు.

దాంతో ఆయనకు పూర్తి కాలపు వెసులుబాటు కల్పిస్తూ అదనపు మెట్రోపాలిటర్ మేజిస్ట్రేట్ ఆర్ బి ఇటాల్యా ఆదేశాలు జారీ చేశారు.  

Related posts

మయన్మార్ నేత సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష

Sub Editor

రఘురామను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచవద్దు

Satyam NEWS

ఘనంగా శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

Leave a Comment