30.7 C
Hyderabad
April 24, 2024 01: 10 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

నోబెల్ విన్నర్ కు రాహుల్ గాంధీ బాసట

pjimage (5)

ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు అభిజిత్, ఆయన భార్య ఎస్తర్‌ డఫ్లో, మరో అమెరికన్‌ ఆర్థికవేత్త మైకేల్‌ క్రెమెర్‌లు సంయుక్తంగా నోబెల్‌ బహుమతికి ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒక సందర్భంలో మాట్లాడుతూ అభిజిత్ భారత ఆర్థిక వ్యవస్థ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్ధిక వ్యవస్థ అంధకారంలో ఉందని ఆయన అన్నారు. అప్పటి నుంచి బిజెపి నాయకులు పలు సందర్బాలలో అభిజిత్ పై వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ‘నోబెల్‌ ప్రైజ్‌ పొందాలంటే.. విదేశి వనితలను రెండో వివాహం చేసుకోవాలనుకుంటా. ఇన్నాళ్లు ఈ విషయం నాకు తెలియదు’ అంటూ  బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు రాహుల్‌ సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన తీవ్రంగా నొచ్చుకున్నారు. బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ అభిజిత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అభిజిత్‌ వామపక్షవాది అని, ఆయన చెప్పే విషయాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడంతో కొత్త వివాదం చెలరేగింది. అభిజిత్ కు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బాసటగా నిలిచారు. బిజెపి వారికి వృత్తి నిపుణుల గురించి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి వారి మాటలను పట్టించుకోవద్దని అభిజిత్ కు సలహా ఇచ్చారు.

Related posts

కలెక్టర్ కావాలన్న యువతి స్వప్నానికి అన్నపురెడ్డి అప్పిరెడ్డి చేయూత

Satyam NEWS

కరోనా నివారణకు ఇంటింటికీ శానిటైజర్లు పంపిణీ

Satyam NEWS

కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా ఎండి అజీజ్ పాషా

Satyam NEWS

Leave a Comment