24.7 C
Hyderabad
September 23, 2023 04: 09 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

ఇంకా అలక వీడని రాహుల్ గాంధీ

rahulgandhi

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పని చేసి పార్టీ సీనియర్లపై అలిగి పక్కకు తప్పుకున్న రాహుల్ గాంధీ ఇంకా తన అలకను మానలేదు. త్వరలో జరగనున్న హరియాణ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక విషయంలో తాను జోక్యం చేసుకునేది లేదని ఆయన ఖరాకండిగా చెప్పేశారు. అంతే కాకుండా ఇప్పటి వరకూ జరిగిన రెండు సమావేశాలలో కూడా ఆయన పాల్గొనలేదు. అభ్యర్ధుల ఎంపికను పార్టీనే చూడాలని తాను అందులో జోక్యం చేసుకునేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అందుకే సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. అయితే ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో మాత్రం రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది కూడా ఇంకా ఆయన నుంచి ధృవీకరణ కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి

Related posts

క్రీడలు దేహా దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

Satyam NEWS

మేడారంలో వైభవంగా మినీ జాతరకు శ్రీకారం

Satyam NEWS

ఈటీవీ జబర్దస్త్ ను మళ్లీ పైకి లేపిన రోజా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!