27.7 C
Hyderabad
April 25, 2024 07: 24 AM
Slider జాతీయం

దళిత బాలికకు బాసటగా ఉన్నందుకు రాహుల్ ట్విట్టర్ ఖాతా బ్లాక్

#rahul gandhi

అత్యాచారానికి గురైన ఒక దళిత బాలికకు న్యాయం చేయాలంటూ రాహుల్ గాంధీ ట్వీట్ పెట్టడంపై అభ్యంతరాలు రావడంతో ఆయన ట్విట్టర్ ఎకౌంట్ ను నిలిపివేశారు.

రాహుల్ గాంధీ ఆ దళిత బాలిక కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫొటోను కూడా ట్విట్ లో ఉంచడంపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ అభ్యంతరం చెబుతూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ అయిన ఆ బాలిక వివరాలు బయటకు చెప్పడం బాలిక హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం ఇది నేరమని అందువల్ల ఆ ట్వీట్ ను తొలగించాలని ఫిర్యాదులో పేర్కొనడంతో ఢిల్లీ పోలీసులు చర్యలకు ఉపక్రమించడంతో ట్విట్టర్ రాహుల్ గాంధీ ఖాతాను నిలిపివేసింది. ఢిల్లీలో జరిగిన ఈ అత్యాచారం సంఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకూ తాను వారి తరపున పోరాడతానని రాహుల్ గాంధీ అన్నారు.

ట్విట్టర్ లో ఆయన హిందీలో చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి ‘‘ తల్లిదండ్రుల కన్నీరు ఒకే విషయాన్ని అడుగుతున్నాయి… తమ కుమార్తెకు…. ఈ దేశం కుమార్తెకు న్యాయం కావాలి…. న్యాయం జరిగే వరకూ నేను వారితోనే ఉంటాను’’ ట్విట్టర్ ఖాతా స్థంభింప చేయడంపై కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తూ రాహుల్ గాంధీ ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలతోనే ఉంటారని తెలిపింది.

Related posts

నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచి వుంచుకోవచ్చు

Satyam NEWS

అధైర్య పడవద్దు అండగా నేనున్నాను

Satyam NEWS

అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment