31.7 C
Hyderabad
April 19, 2024 01: 48 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ లో రాహుల్ యాత్ర

#rahulyatra

 రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నవంబర్  1 వ తేదీన శంషాబాద్ మీదుగా ఉదయము 9 గంటలకు హైదరాబాద్  నగరములోని ఆరాంఘర్ కు చేరుకుంటుందని పి‌సి‌సి ప్రకటించింది.  అక్కడ నుండి  10.30 గంటలకు తాడ్ బండ్ వద్ద గల లెజెండ్ ప్యాలెస్ చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారని , సాయాంత్రము 4 గంటలకు పురానాపూల్ వద్ద ప్రారంభమై హుస్సేనిఆలం, లాడ్ బజార్ మీదుగా 4.30 గంటలకు చార్మినార్ కు చేరుకుంటుందని తెలిపింది. 1990  అక్టోబర్ 19 వ తేదీన  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  పార్టీ పతాకాన్ని ఎగుర వేసి జంట నగరాలలో సద్భావనా యాత్రా ప్రారంభించిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక స్తంభంపై  రాహుల్ గాంధీ  జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, ఆ తర్వాత  గుల్జార్ హౌజ్, మదీనా, నయాపూల్, ఉస్మాన్ గంజ్, మొజాంజాహి మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ, ఎ.జి ఆఫీస్, ఎన్ టి ఆర్ గార్డెన్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుని కార్నర్ లో మీటింగ్ జరుగుతుందని తెలిపింది. హైదరాబాద్ నగర ప్రజలు రాహుల్ యాత్ర లో అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ణప్తి చేసింది.

Related posts

ఆడియన్స్ “పల్స్” పట్టుకుంటారని గట్టిగా నమ్ముతున్నాను

Satyam NEWS

యాక్షన్ కింగ్ అర్జున్ -క్రికెట్ కింగ్ హర్భజన్ ఫ్రెండ్ షిప్ టీజర్ విడుదల

Satyam NEWS

నిర్మాతలకు వరం: “ప్రొడ్యూసర్ బజార్ – బెటర్ ఇన్వెస్ట్”

Satyam NEWS

Leave a Comment