28.7 C
Hyderabad
April 17, 2024 05: 21 AM
Slider ముఖ్యంశాలు

డింపుల్…. డింపుల్ ఎంతపని చేశావు?

#dimpleyadav

ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఈ ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పార్లమెంటు స్థానంలో సమాజ్ వాది పార్టీకి బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అకస్మాత్తుగా ఇటావా రైల్వే స్టేషన్ విచారణ కేంద్రం నుంచి ఎస్పీ అభ్యర్థి డింపుల్ యాదవ్‌ ను గెలిపించాలని విజ్ఞప్తి రావడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నది.

డింపుల్ యాదవ్ కు ఓటు వేయాలని రైల్వే ఎనౌన్స్ మెంట్ లో విజ్ఞప్తి చేశారు. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో లేకపోతేనే ఇలా అధికార యంత్రాంగాన్ని గుండాయిజంతో దుర్వినియోగం చేస్తున్నారని, ఇక గెలిస్తే ఏం చేస్తారో అర్ధం చేసుకోవాలని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. ఈ విషయంపై రైల్వేశాఖకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించుకుంది. శనివారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో ఇటావా జంక్షన్ స్టేషన్‌లోని విచారణ కార్యాలయం నుండి రైలు ప్రకటనకు బదులుగా డింపుల్ యాదవ్ కు ఓటు వేయాలని, డింపుల్ యాదవ్ జిందాబాద్ అని నినాదాలు ప్రారంభమయ్యాయి.

దీంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు కూడా షాక్‌కు గురయ్యారు. కొంతమంది ప్రయాణికులు విచారణ కేంద్రం వద్దకు చేరుకుని దీనిపై ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించినా ఎవరూ మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. వాస్తవానికి రైల్వే యూనియన్‌కు చెందిన కొందరు కార్మికులు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నట్లు సమాచారం. ఇంతలో, కొంతమంది సిబ్బంది రైల్వే ఎంక్వైరీ లోపలికి ప్రవేశించి ఈ సందేశాన్ని ప్రసారం చేసారు.

డింపుల్ యాదవ్ జిందాబాద్ అనే సందేశాన్ని ప్రసారం చేసి ఓటు వేయాలని కోరారు. దాంతో స్టేషన్‌లో ఉన్న ప్రజలు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొంతమంది ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ కేసులో బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ షాక్యా మాట్లాడుతూ, ఈ చర్య సమావ్ వాది పార్టీ ఓటమికి గుర్తు అని అన్నారు. సమాజ్ వాదీ పార్టీ అధికారంలో లేకపోయినా ఇలాంటి గూండాయిజం చేస్తోందని అన్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Related posts

మన హక్కులను మనమే కాపాడుకోవాలి

Satyam NEWS

దేశాన్ని ఏకం చెయ్యడమే రాహుల్ యాత్ర లక్ష్యం

Murali Krishna

రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపికైన ములుగు విద్యార్ధులు

Satyam NEWS

Leave a Comment