28.7 C
Hyderabad
April 25, 2024 06: 56 AM
Slider ఆదిలాబాద్

రైల్వేరంగంలో ఆదిలాబాద్ జిల్లాపై ప్రభుత్వాల వివక్ష

#Congress Adilabad

రైల్వేరంగ సమస్యల పరిష్కరంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతమైన ఆదిలాబాద్​ జిల్లాపై తీవ్ర వివక్షచూపుతు మరింత వెనుకబడేలా చేస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్​ నేత చిల్కూరి రాంచంద్రారెడ్డి  ఆరోపించారు. 

గురువారం స్థానిక శాంతినగర్​లోని తన నివాసంలో  నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ఉమ్మడిజిల్లా వర్కింగ్​ ప్రెసిడెంట్​ నరేష్​ జాదవ్​తో కలిసి మాట్లాడారు.  ఆదిలాబాద్​ పట్టణంలో  రైల్వే ఒవర్​బ్రిడ్జిలేక  ఏళ్లుగా  ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతోనే నిర్మాణంలో  జాప్యం జరుగుతుందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కట్​చేసైనా ఓవర్​ బ్రిడ్జిని నిర్మించవచ్చన్నారు.  ఏళ్లక్రితం మంజూరైన ఆదిలాబాద్​ టు ఆర్మూర్​ రైల్వేలైన్​కు  చిల్లిగవ్వ ఇవ్వకపోగా  సీఎం కేసీఆర్​, అల్లుడు హరీష్​ రావు,  కొడుకు కేటీఆర్​లు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల పరిధిలోని కొత్తపల్లి టు మనోహరాబాద్​ రైల్వేలైన్​ రెండేళ్లలోనే పూర్తిచేసి రైళ్లను సైతం ప్రారంభించారన్నారు. 

ఆదిలాబాద్​ టు హింగన్​ఘాట్​,  ఆదిలాబాద్​ టు పటాన్​చెరు రైల్వేలైన్లను ప్రకటించిన కేంద్రం వాటిపై ఎలాంటి ఆసక్తి చూపకుండా ఆదిలాబాద్​ జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు.  జిల్లా నుంచి ప్రశ్నించే నేతలు కరువయ్యారని అందుకే  ప్రభుత్వాలను జిల్లాను లైట్​గా తీసుకుంటున్నాయని మండిపడ్డారు. 

కరోనా లాక్​డౌన్​ తర్వాత ప్రారంభమవుతున్న ముంబాయి టు నాగ్​పూర్​  నందిగ్రామ్​ ఎక్స్​ప్రెస్​ రైలును  తాము చేసిన విజ్నప్తి మేరకు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభించేందుకు రైల్వే జీఎం అంగీకరించారన్నారు.  దీన్ని ఆదిలాబాద్​ వరకు సైతం పొడగించారని  ఇందుకు పార్టీపక్షాన జీఎంకు కృతజ్నతలను చెబుతున్నట్లుగా వెల్లడించారు. 

ఈ సమావేశంలో  పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజీద్​ఖాన్​,  అంబకంటి అశోక్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

శివోహం: వేయి స్తంభాల గుడిలో మంత్రుల పూజలు

Satyam NEWS

కుంగిపోతున్న ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థలు

Satyam NEWS

ప్రతి ఆదివారం పరిశుభ్రతకు పది నిమిషాలు కేటాయించాలి

Satyam NEWS

Leave a Comment