27.7 C
Hyderabad
April 20, 2024 02: 19 AM
Slider వరంగల్

అకాల వర్ష బాధిత రైతులను ఇప్పటికైనా ఆదుకోవాలి

#BJPMulugu1

అకాల వర్షలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ  కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. ములుగు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు జినుకల కృష్ణాకర్ రావు మాట్లాడుతూ జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తూంటే మరొక వైపు అకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

వేలాది మంది రైతులకు రుణాలను మాఫీ చేయకుండా  బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆయన తెలిపారు. అయితే కేసిఆర్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ కి అనుగుణంగా  ఒకేసారి రుణమాఫీ చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.

అకాల వర్షలతో లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని అలాంటి రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లాంలని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు మండల అధ్యక్షులు ఉమ్మడి రాకేష్ యాదవ్, జిల్లా కోశాధికారి కొమ్మిరెడ్డి  నరసింహారెడ్డి, కార్యాలయ కార్యదర్శి చల్లూరి మహేందర్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాయికంటి పరమేశ్వర్, న్యాయవాది కొండి రవీందర్, గంగిశెట్టి రాజకుమార్, రాకేష్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అభిమానుల కోలాహలం మధ్య తస్లీమా జన్మదిన వేడుకలు

Satyam NEWS

సంగారెడ్డి జిల్లా పరిషత్తు మరిన్ని అవార్డులు సాధించాలి

Satyam NEWS

తక్లీఫ్: ఢిల్లీ వెళ్లాడు కరోనా బారిన పడ్డాడు

Satyam NEWS

Leave a Comment