27.7 C
Hyderabad
April 24, 2024 09: 27 AM
Slider ముఖ్యంశాలు

విజయనగరం లో కమ్మిన కారు మబ్బులు.. ..చల్లదనంతో నగరం..!

#VijayanagaramRain

విద్యల నగరమైన విజయనగరం లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు మండుటెండ..ఉక్క పోతతో అల్లాడిపోయింది,..విజయనగరం.

ఆ సమయంలో నగరంలో ఆనందగజపతి ఆడిటోరియంలో సేవా పురస్కారాల కార్యక్రమం.మంత్రి బొత్స, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తదితరులు పెద్దలంతా హాజరయ్యే కార్యక్రమం.

అదే సమయంలో ఆడిటోరియంలో ఎల్ సీ.డీ స్క్రీన్ లలో సీఎం జగన్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఆడిటోరియం మొత్తం ఏసీలో ఉన్నా..ఎల్సీడీల పుణ్యమా… మొత్తం హీటెక్కిపోయింది.

దీంతో మే రాకముందే వేసివి ఏంటో తెలిసింది. అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా నగరంలో వాతావరణం మారిపోయింది.

మెల్లమెల్లగా సాయంత్రం అయిదు అయ్యేసరికి వాతావరణం మొత్తం చల్లబడింది. ఆకాశం మేఘావృతం అయ్యింది.

కారు మబ్బులు నీలిరంగులో ఉన్న ఆకాశాన్ని కప్పేసాయి.దీంతోపాటు మెల్లమెల్లగా గాలులు మొదలయ్యాయి.

పర్యవసానం గా…విజయనగరంలో.. వాతావరణం కాస్త చల్లబడింది. నగర ప్రజలకు కాస్త హమ్మయ్య అని అనిపించింది.

Related posts

మునిసిపల్ కార్మికులకు గంగమ్మ జాతర బహుమానం ఇవ్వాలి

Bhavani

ఆడ‌బిడ్డ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌లు పంపిణీ చేసిన ఎర్రబెల్లి

Satyam NEWS

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే కేసీఆర్ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment