38.2 C
Hyderabad
April 25, 2024 12: 01 PM
Slider హైదరాబాద్

డ్రిజిలింగ్: తెలంగాణ వ్యాప్తంగా చిరుజల్లులు

#Charminar

జూన్ 1 వ తేదీన కేరళ రాష్ట్రంలోనికి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వేసిన అంచనాకు అనుగుణంగా అప్పుడే తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం చూపించింది.

ఇది రాగల 24 గంటలలో తూర్పు మధ్య అరేబియా సముద్రం  దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో  వాయుగుండముగా మారే అవకాశం ఉంది. దాంతో తదుపరి 24 గంటలలో తుఫానుగా మారే అవకాశం ఉంది. జూన్ 3 వ తేదీకల్లా ఉత్తర మహారాష్ట్ర గుజరాత్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది.

రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని  ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. చత్తీస్ గఢ్ నుండి లక్షదీవులు వరకు  తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్  కర్ణాటక, కేరళ మీదుగా 0.9 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, ఎల్లుండి కొన్నిచోట్ల, రేపు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడురోజులు ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Related posts

వైసీపీ కేంద్ర కార్యాలయం కాదు కుట్రలకు కేంద్రాలయం

Satyam NEWS

కుట్ర భగ్నం: ముగ్గురు ఉగ్రవాదులు హతం

Bhavani

కారు ప్రమాదంలో హైదరాబాద్ యువతి బ్రెయిన్‌డెడ్

Satyam NEWS

Leave a Comment