31.7 C
Hyderabad
April 24, 2024 23: 52 PM
Slider ముఖ్యంశాలు

కోస్తా ఆంధ్రను తాకుతున్న నైరుతి రుతుపవనాలు

#Rains In Andhra

నైరుతి రుతుపవనాలు  కోస్తాంధ్రను తాకుతున్నాయి. రాయలసీమలో మరింత ముందుకు ఇవి కదులుతాయని కూడా వాతావరణశాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కర్నాటకలోని కర్వార్, షిమోగ, తుముకూరు, ఆంధ్రాలోని చిత్తూరు, చెన్నైలలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.

మరో రెండుమూడు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో నేటికల్లా అల్పపీడనం ఏర్పడవచ్చని మొదట అంచనా వేసినా ఇది ఒక రోజు ఆలస్యంగా రేపు సాయంత్రానికి ఏర్పడగలదని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ అల్పపీడనం ఏర్పడ్డాక వాయవ్యంగా కదులుతుంది. దీని ప్రభావంతో ఉత్తరకోస్తా, దాన్ని ఆనుకున్న ఒడిసా, తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడతాయి. చెదురుమదురుగా అతి భారీ వర్షాలు కూడా పడతాయి.

Related posts

తెలంగాణలో ఒక్క రోజులో తాగేసింది ఎంతో తెలుసా?

Satyam NEWS

యాప్ లు ఇలానే నొక్కి ఉంచితే ఇక చైనా ఫసక్

Satyam NEWS

ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో ఆర్థికంగా ఎదగాలి

Satyam NEWS

Leave a Comment