35.2 C
Hyderabad
April 20, 2024 16: 27 PM
Slider ముఖ్యంశాలు

రైతుబంధు మాసపత్రిక వ్యవసాయ రంగ కథల పోటీ

raitubandhu

రైతుబంధు మాసపత్రిక వ్యవసాయ రంగ కథల పోటీని నిర్వహిస్తున్నది. ప్లాంట్ హెల్త్ (పంటల ఆరోగ్యం) ప్రధానాంశంగా ఉండే కథలను రచయితల నుంచి ఆహ్వానిస్తున్నట్లు రైతు బంధు మాసపత్రిక ఎడిటర్ ఎన్.లక్ష్మీమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.

2020 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో ఈ పోటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పంటల ఆరోగ్యాన్ని కాపాడడంలో కృషి చేస్తున్న సంస్థల నిర్వాహకుల విజయ గాథలు, వ్యవసాయ రంగంలో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలు, వ్యవసాయ అధికారుల కృషి, నకిలీ పురుగు మందులు, తగ్గిపోతున్న భూసారం, శీతోష్ణస్థితి మార్పులు లాంటి అంశాలను నేపథ్యంగా తీసుకొని కథలు రాయవచ్చు.

నిజజీవిత వాస్తవిక సంఘటనల ఆధారిత కథలకు ప్రాధాన్యం ఉంటుంది. మొక్కలకు వచ్చే వ్యాధులు – తెగుళ్ళ కారణంగా రైతులు పడే ఇబ్బందులతో పాటుగా ఆహారం పరంగా దేశ జనాభా ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పించడం ఈ కథల పోటీ లక్ష్యం. నెస్ట్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలో ప్రథమ బహుమతి  రూ. 1,116. ప్రచురణకు ఎంపికైన  పది కధలకు రూ.500 చొప్పున బహుమతి అందచేస్తారు.

విజేతలకు బహుమతులు అందించేందుకు తెలంగాణ రిసోర్స్ సెంటర్ (టిఆర్ సి) ఛైర్మన్ వేదకుమార్ ముందుకు వచ్చారు. కథలు పంపించేందుకు చివరి తేదీ: జనవరి 31. కథలు పంపాల్సిన మెయిల్ ఐడీ: rythubandhu@gmail.com మరిన్ని వివరాలకు  9848902520 ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చు.

Related posts

భక్తి భావనతో దైవానుగ్రహం పొందవచ్చు

Satyam NEWS

టెన్త్ పరీక్షాకేంద్రాలను పరిశీలించిన అధికారులు

Satyam NEWS

స్కిల్ డెవలప్ మెంట్ లో మహిళలకు 30 రోజుల శిక్షణ

Satyam NEWS

Leave a Comment