39.2 C
Hyderabad
March 29, 2024 15: 53 PM
Slider నిజామాబాద్

క్లారిటీ: రైతులందరికీ యధావిధిగా రైతు బంధు

#Minister Vemula Prashanth Reddy

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న లాభసాటి వ్యవసాయ విధానం పై అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పిఏసీఎస్ చైర్మన్ లు,రైతు బంధు సమితి ప్రతినిధులు అధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు లాభసాటి వ్యవసాయ విధానం వైపు రైతులు మొగ్గు చూపాలని కోరుతున్నానన్నారు. బాల్కొండ నియోజకవర్గం లో 60 వేల ఎకరాల్లో పోయిన ఏడాది వరి పండించారని తెలిపారు. ఈ వానాకాలం పంటకు కూడా 60 ఎకరాల్లో వరి వేసుకోవచ్చు కానీ 30 వేల ఎకరాల్లో సన్నరకం,30 వేల ఎకరాల్లో దొడ్డు రకం వేయాలని సూచించారు.

వానాకాలం మక్క పంట వద్దన్నారు. గత సీజన్ లో 30 వేల ఎకరాల్లో మక్క పంట వేయగా ఈ సారి దాంట్లో 25 వేల ఎకరాల్లో సొయా పంట వేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. మిగతా ఐదు ఎకరాల్లో పత్తి, కూరగాయలు,కంది ఇతర పంటలు వేసుకోవచ్చని తెలిపారు.40వేల ఎకరాల్లో పసుపు పంట సాగు అవుతోందని కేవలం పసుపు పంటకు అంతర్ పంట గా మాత్రమే మక్కను వేసుకోవాలని సూచించారు.

డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే రైతుకే మేలు

దేశంలో ఏ రాష్ట్రమైన 30 శాతం లోపు పంటనే కొనుగోలు చేస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే రైతులు ఇబ్బంది పడొద్దని వంద శాతం పంటను కొనుగోలు చేసింది. ప్రతిసారి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పంటను కొనే అవకాశం ఉండకపోవచ్చున్నారు.

డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే.. ప్రభుత్వాలతో నిమిత్తం లేకుండా రైతు పండించిన పంటకు మంచి ధర వస్తుందన్నారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను, మార్కెటింగ్ పరిస్థితులను అంచనావేసి,పంట రకాలను,పంటల విస్తీర్ణాన్ని సూచించేందుకు రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో కూడిన కమిటీ,మార్కెటింగ్ నిపుణులతో కూడిన మరో కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ వేశారని తెలిపారు.

ముఖ్యమంత్రి చెప్పిన పంటలు వేయకుంటే రైతు బంధు రాదు అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని..కేసీఆర్ ఉన్నంత వరకు రైతు బంధు ఆగే పరిస్థితే ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి,పలువురు ప్రజా ప్రతినిధులు,పిఏసీఎస్ చైర్మన్లు, రైతు బంధు సమితి ప్రతినిధులు,వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Related posts

సంతోషం ఫిలిం అవార్డ్స్ లో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ

Bhavani

నిర్మాతలకు వరం: “ప్రొడ్యూసర్ బజార్ – బెటర్ ఇన్వెస్ట్”

Satyam NEWS

గుడ్ న్యూస్: డాక్టర్లకు, వైద్య సిబ్బందికి శాలరీ కట్ లేదు

Satyam NEWS

Leave a Comment