32.2 C
Hyderabad
April 20, 2024 19: 02 PM
Slider కడప

రాజారెడ్డి రాజ్యాంగం నశించాలని రాజ్యాంగ నిర్మాతకు వినతిపత్రం

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గం ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆదేశాను సారం తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు 395 సూత్రాలు 9 పట్టికలతో ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారని,ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన నశించాలని నిరసన వ్యక్తం చేస్తూ భారత రాజ్యాంగమే కొనసాగించాలని ఈ రాష్ట్రానికి ఇదేమి కర్మ అనే నినాదంతో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ గతంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే ముందున్న రాష్ట్రం ఇప్పుడు అవినీతి ,అరాచకం, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, కోర్టుదిక్కరణ కేసులలో మొదటి స్థానంలో ఉందని ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని ప్రజలంతా ఆలోచన చేయాలని అన్నారు.రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే పాలకుడు చెడ్డవాడైతే అది చెడ్డ ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించే చట్టసభలను దూషణలకు, అసత్యాలకు వేదిక చేసి చట్టసభల గౌరవాన్ని తగ్గించారన్నారు. ప్రతిపక్షాలనే కాకుండా, మీడియా ,న్యాయవ్యవస్థల పైన దాడికి దిగుతున్నారన్నారు. న్యాయమూర్తులపై ఆరోపణలు చేసే స్థితికి వైసీపీ నాయకులు బరితెగించారని ఆరోపించారు. రాష్ట్రంలో కొంతమంది అధికారులు కూడా వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అలాంటివారిని వైసిపి ప్రభుత్వం పెద్దలే రక్షించి, ప్రోత్సాహిస్తున్నారు. నాలుగో పాదంగా ఉన్న మీడియాను సైతం తమ చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకు రాజ ద్రోహం వంటి కేసులు పెట్టి మీడియా ఛానల్ల ప్రసారాలను నిలిపివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 వేల పైచిలుకు కోర్టు ధిక్కరణ కేసులు రాష్ట్ర ప్రభుత్వంపై నమోదయాయని దీన్ని బట్టి రాష్ట్రంలో పాలన ఏ విధంగా కొనసాగుతుందో అర్థం చేసుకోవాలని కోరారు.రాష్ట్ర ప్రజలు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అంటూ గగ్గోలు పెడుతున్నారని., మన రాష్ట్రానికి పట్టిన కర్మ త్వరలోనే వైదొలగాలని రాష్ట్ర ప్రజలు తొందరలోనే వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి చరమగీతం పాడుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చెన్నూరు సుధాకర్, మహిళా అధ్యక్షురాలు అనసూయ దేవి, పట్టణ అధ్యక్షుడు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు గన్నే సుబ్బ నరసయ్య నాయుడు, ప్రధాన కార్యదర్శి మండెం అబుబాకర్, తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రాంనగర్ నరసింహ ,పట్టణ మాజీ అధ్యక్షుడు తరిగోపుల సంజీవరావు, పార్లమెంట్ అధికార ప్రతినిధి అద్దేపల్లి ప్రతాప్ రాజు, కార్యనిర్వాహక కార్యదర్శి కొండ శ్రీనివాసులు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, మాజీ కౌన్సిలర్ గుగ్గిళ్ళ చంద్రమౌళి, మనుబోలు వెంకటేశ్వర్లు, క్లస్టర్ ఇంచార్జీలు పసుపులేటి దుర్గా ప్రవీణ్, కొల్లి రెడ్డయ్య నాయుడు, మిరియాల జ్యోతి, టిడిపి సీనియర్ నాయకులు ఇడిమడకల కుమార్, తెలుగుయువత పార్లమెంట్ అధికార ప్రతినిధి జగధాబి పాండురాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ యస్.కె. కరీం, ఎస్సీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జ్యోతి శివ శంకర్, పట్టణ అధ్యక్షుడు జడ శివకుమార్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు మన్నూరు పీరు సాహెబ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మండెం కరిముల్లా, ఆర్లగడ్డ వెంకట్ రాజు, వార్డు అధ్యక్షులు తేజాల ఆనంద్, ఎన్టీఆర్ కేశవ, ఐటిడిపి మేడ మునిబాలసుబ్రమణ్యం, సునీల్ శెట్టి, ఆర్లగడ్డ వెంకట్ రాజు, తెలుగు మహిళ దాసరిరాజు వాని, కేతా నరసింహ రావు, భువనగిరి పల్లి సుబ్బనరసయ్య, ఓబిలి మల్లికార్జున్ రెడ్డి, చంగయ్య నాయుడు, బాషా, ఎంపీ రావు, కట్టా సునీల్ , అదెయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

ట్రిబ్యూట్: జర్నలిస్టు మనోజ్ కు కొవ్వొత్తుల నివాళి

Satyam NEWS

మరో మూడు రోజులు వర్షాలు

Bhavani

భారత ప్రభుత్వంపై నేపాల్ ప్రధాని తీవ్ర ఆరోపణలు

Satyam NEWS

Leave a Comment