26.7 C
Hyderabad
May 1, 2025 05: 19 AM
Slider నల్గొండ

బెల్ట్ షాపులు మూసేస్తే ఐదు లక్షలు ఇస్తా

komatireddy

రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతుందని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం బెల్టు షాపులను ఇప్పటికైనా అరికట్టాలని లేకపోతే మరిన్ని అనర్థాలు జరుగుతాయని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం వల్లే నేరాలు జరుగుతున్నయని ఆయన అన్నారు.

అలాంటి మద్యాన్ని అదుపు చేయకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. రాత్రి ఎనిమిది గంటలకే వైన్ షాపులను మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడు నియోజక వర్గ పరిధిలోని గ్రామాల్లోని వారంతా కలిసి కట్టుగా బెల్టు షాపులను మూసేస్తే తన తల్లి సుశీలమ్మ పేరున ఉన్న ఫౌండేషన్ ద్వారా ఐదు లక్షల నజరానా ఇస్తానని చెప్పారు.

మునుగోడులో సీపీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పత్తి కొనుగొలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Related posts

జులై 20.. ‘బాలు’ గారి ఫోన్…

Satyam NEWS

వ‌రుస‌గా స్టేష‌న్ల ను త‌నిఖీ చేస్తున్న విజయనగరం జిల్లా ఎస్పీ

Satyam NEWS

రసాభాసగా మారిన మూవీ ఆర్టిస్టుల డైరీ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!