`బాహుబలి`తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. ఎన్టీయార్, రామ్‌చరణ్ ఈ సినిమాలో హీరోలు. ఇది భారీ బడ్జెట్ చిత్రం. కొమరం బీమ్, అల్లూరి సీతారామరాజులకు సంబంధించిన కథ ఇది. 2020 జులై 30న విడుదలవుతుందని చిత్రబృందం ముందుగా ప్రకటించింది. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్నదట. దీంతో సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. ముందుగా అనుకున్నట్టు జులై 30న కాకుండా దసరా సమయానికి, లేదా 2021 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారట. మరి ఎన్టీయార్, రామ్‌చరణ్ అభిమానులు అప్పటి వరకూ ఎదురు చూడక తప్పదు.
previous post